లెక్క దాటితే వేటే..
ABN , Publish Date - Dec 03 , 2025 | 01:31 AM
పల్లె పోరు లో అధిక వ్యయానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు వ్యయ పరి మితిని విధించడంతో పాటు గ్రామాల్లో ప్రత్యేక యం త్రాంగంతో నిఘా ఏర్పాటు చేసింది.
జగిత్యాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పల్లె పోరు లో అధిక వ్యయానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు వ్యయ పరి మితిని విధించడంతో పాటు గ్రామాల్లో ప్రత్యేక యం త్రాంగంతో నిఘా ఏర్పాటు చేసింది. రోజురోజుకూ పెరుగుతున్న ఎన్నికల వ్యయాన్ని నియంత్రించడానికి ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. అభ్యర్థు లు ఎంత ఖర్చు చేయా లనే విషయంలో నూ స్పష్టమైన పరిమితులు విధించింది. అయితే ఎన్నికల సంఘం
పేర్కొన్న నిబంధనలకు ప్రస్తుతం గ్రా మాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదన్న ఆరోపణ లు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ (ఈసీ) పరిమితికి మించి అభ్యర్థు లు పది నుంచి ఇరవై రెట్లు ఎక్కువ వెచ్చిస్తున్నారు. ధన ప్ర వాహ కట్టడికి కలెక్టర్ సత్యప్రసాద్ నేతృత్వంలోని యంత్రాంగం ప్రత్యే క నిఘా పెడుతోంది. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన నిబంధ నలు నవంబరు 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే జిల్లాలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు పకడ్బందీగా వాహనాల తనిఖీ చేస్తున్నారు. జిల్లా వ్యయ నిర్వహణ నోడల్ అధికారిగా జిల్లా ఆడిట్ అధికారి సుజాత వ్యవహరిస్తుండగా, జిల్లా వ్యయ పరిశీలకుడిగా పెద్దపల్లి ఆడిట్ అధికారి ఎం.మనోహర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రోజు వారీగా లెక్కలు..
పోటీ చేసే ప్రతి అభ్యర్థి నామినషన్ల నుంచి ఎన్ని కలయ్యే వరకు ప్రచార కార్యక్రమాల నిమిత్తం ఎంత ఖర్చు చేయాలనే విషయంలో స్పష్టమైన నిబంధన లున్నాయి. ఏయే అవసరాలకు ఎంత ఖర్చు చేయా లనే విషయాలను ఈసీ స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల ఖర్చును మూడు రోజులకు లేదా పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ వరకు చూపిం చే వీలు ఉండేది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం అభ్యర్థి తాను చేస్తున్న ఖర్చును రోజువారీగా అధికారులకు చూపించాలి. అంతేకాకుండా వివరాలను ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వెబ్‌సైట్‌లో సైతం నమో దు చేయాలని నిబంధన ఉంది. నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తే వాటికి సంబంధిం చిన వివరాలను కూడా నమోదు చేయాలని అధికా రులు సూచిస్తున్నారు.
ప్రతీ నిత్యం మందు...విందులు..
ఎన్నికల కమిషన్ నిబంధనలతో అభ్యర్థులు జాగ్ర త్తగా ఉండాలని ఆయా పార్టీలు ముందుగానే తమ మద్దతుదారులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఎన్నికల్లో ధన వ్యయాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో కమిషన్ నిబంధనలు విధిస్తున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం లోలోపల ఖర్చుకు వెనుకాడడం లేదు. జిల్లాలో మొత్తం 385 జీపీలు, 3,536 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తొలి విడతలో 122 జీపీలు, 1,172 వార్డులు, రెండో విడతలో 144 జీపీలు 1,276 వార్డులు, మూడో విడతలో 119 జీపీలు, 1,088 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతల నామినేషన్ల పర్వం ముగిసి ప్రచార పర్వానికి తెరలేసింది. ప్రతి నిత్యం వాహనాల ఏర్పాటు, భోజనాలు, మందు, విందు ఖర్చుల పేరిట భారీగానే వెచ్చిస్తున్నారు.
పంచాయతీల్లో రూ.1.50 లక్షల పరిమితి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థి నేర చరిత్రకు సంబధించిన వివరాలను నామినేషన్లతో పాటు పొందుపరచాల్సి ఉంటుంది. ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో (మేజర్ గ్రామ పంచాయతీ) పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేసుకునే వీలుంది. మేజర్ పంచాయతీలలో వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు రూ.50 వేల వరకు ఖర్చు చేయవచ్చనే నిబంధన ఉంది. ఇక ఐదు వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో (మైనర్ పంచాయతీలు) పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసే వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించింది. చిన్న పంచాయతీలలో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తే రూ.30 వేల వరకు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. ఖర్చుల పరిమితి దాటితే వేటు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.