అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తా
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:26 AM
జగిత్యాల అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె పార్టీ కార్యాలయంలో శనివా రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లా డారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
జగిత్యాల అగ్రికల్చర్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): జగిత్యాల అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె పార్టీ కార్యాలయంలో శనివా రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లా డారు. ప్రజాజీవితంలో ఎదుగుదల చూసి ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం పరిపాటిగా మారిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 73ఏళ్ల క్రితం జరిగిన భూ విషయంలో ఏడేళ్ల కింద ఎమ్మెల్యే అయిన తనపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రావణి ఆరోపణలు చేయడం అర్థరహితమని, ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం విషయంలో ఎవరికీ మద్దతు ఇవ్వబోనన్నారు. అర్బన ఇనఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద బ్యాంకులోన ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించి జగిత్యాలకు రూ.50కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నేషనల్ హౌజింగ్ బ్యాంకు ద్వారా రాష్ట్రాలకు అప్పుగా వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుం దన్నారు. కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేశారని చెప్పడం వారి అవగాహన లోపానికి నిదర్శనం అన్నారు. సమావేశంలో నాయకులు గోలి శ్రీనివాస్, బాలె శంకర్, క్యాదాసు నవీన, పోతునక మహేష్, చెట్‌పల్లి సుధాకర్, ముస్కు నారాయణ, కూసరి అనిల్, దుమాల రాజ్‌కుమార్, బద్దం జగన, పంబాల రాము, శ్రీనివాస్, తిరుమలయ్య, బొడ్ల జగదీష్, అహ్మద్, కోరె గంగమల్లు, రాంమోహనరావు, గుర్రంరాము, కూతురు శేఖర్, ఆరుముల్లపవన, లవంగ రాజేంధర్, రామకృష్ణారెడ్డి, శరతరావు, రంగు మహేష్, శ్రీరాం భిక్షపతి, ప్రవీణ్‌రావు, గౌస్, వంశీబాబు,గంగాధర్ తదితరులున్నారు.
కలెక్టర్‌కు లేఖ
- జగిత్యాల పట్టణంలోని స్థానిక కొత్త బస్టాం డ్ సమీపంలో సర్వే నంబర్ 138తో పాటుగా, ఇతర సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి దురా క్రమణకు గురైనట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విచారణ జరపాలని కోరుతూ కలెక్టర్‌కు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లేఖ రాశారు. అందులో పెట్రోల్ బంకుతో పాటు, బార్‌లు, ఇతర దుకాణస ముదాయాలు ఉన్నాయని వాటిపై విచారణ జరిపి, ప్రభుత్వ భూమి అక్రమణకు గురైతే తక్షణ మే స్వాధీనం చేసుకోవా లని లేఖలో ఎమ్మెల్యే పేర్కొన్నారు.