Share News

దుర్గామాత నమోస్తుతే

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:40 PM

దుర్గాష్టమిని పురస్కరించుకొని అమ్మవారిని దుర్గామాత రూపంలో మంగళవారం భక్తులు కొలిచారు. కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో దుర్గామాత (సిద్ధిధాత్రి) పూజ జరిపి రత్నాలతో, దీపాలతో అలంకరించారు.

దుర్గామాత నమోస్తుతే

కరీంనగర్‌ కల్చరల్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : దుర్గాష్టమిని పురస్కరించుకొని అమ్మవారిని దుర్గామాత రూపంలో మంగళవారం భక్తులు కొలిచారు. కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో దుర్గామాత (సిద్ధిధాత్రి) పూజ జరిపి రత్నాలతో, దీపాలతో అలంకరించారు. సాయంత్రం నేత్రపర్వంగా పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయం జనంతో కిక్కిరిసిపోయింది. రతన్‌కుమార్‌ బృదం ఆలయ సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. యజ్ఞవరాహక్షేత్రంలోని వరదుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబజార్‌ గౌరీశంకరాలయంలో దుర్గాదేవి అలంకరణ చేశారు. శ్రీపురంలో దుర్గామాత పూజల అనంతరం బతుకమ్మ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అశోక్‌నగర్‌ మళయాళ సద్గురు గీతామదిరంలో అమ్మవారికి విష్ణుసేవానందగిరిస్వామి పూజలు చేసి ప్రవచనం చేశారు.

Updated Date - Sep 30 , 2025 | 11:40 PM