Share News

పారదర్శకంగా ఎన్నిల విధులు నిర్వర్తించాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:39 AM

మొదట విడత పంచాయతీ ఎన్నికలో భాగంగా ఈనెల 11న మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో నిర్వహించే ఎన్నికలను అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు.

పారదర్శకంగా ఎన్నిల విధులు నిర్వర్తించాలి
ఎన్నికల శిక్షణలో అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

- కలెక్టర్‌ సత్యప్రసాద్‌

మెట్‌పల్లి రూరల్‌/ఇబ్రహీంపట్నం, డిసెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి) : మొదట విడత పంచాయతీ ఎన్నికలో భాగంగా ఈనెల 11న మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో నిర్వహించే ఎన్నికలను అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. శుక్రవారం మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణపై పీవో(ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల)లకు ఇస్తున్న శిక్షనను కలెక్టర్‌ పరిశీలించారు. ఎన్నికల్లో నిర్వహర్తించే విధివిధానాలపై అవగాహన కల్పిస్తున్న విధానాన్ని పరిశీలించి పలు అంశాలపై వారిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ అధికారులు ఎన్నికల విధులను అత్యంత బాధ్యతతో నిర్వహించాలని, ప్రతి పీవో తమ ప్రాతను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా, పారదర్శంగా నిర్వహించాల్సిన బాధ్యత పీవోలపై ఉందన్నారు. పోలింగ్‌ రోజు అనుసరించాల్సిన విధివిధానాలు, పోలింగ్‌ స్టేషనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కు సంబంధించిన పలు అంశాలపై మార్గదర్శకాలు చేస్తూ సూచనలు చేశారు. కార్యక్రమంలో మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్‌, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం తహసిల్దార్లు నీత, వరప్రసాద్‌, ఆర్‌ఐ కాంతయ్య, ఎంపీడీవో సురేష్‌, ట్రైనర్‌ లింబగిరిస్వామి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:39 AM