ఆసుపత్రి కార్మికుల వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:58 PM
రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ డిమాండ్ చేశారు.
సుభాష్‌నగర్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆసుపత్రిలో 250 మంది కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. వారికి ప్రతి నెలా వేతనాలు చెల్లించడంలేదని, ఏదో రూపంలో ఆందోళనలు, నిరసనలు చేయాల్సి వస్తుందన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి, జీవో 40 ప్రకారం కార్మికులకు నెలకు 15 వేల నుంచి 22 వేల వరకు వేతనాలు చెల్లించేలా కలెక్టర్ చొరవ చూపాలని కోరారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పి అరుణ్, ప్రధానకార్యదర్శి పి కళావతి, రాజు, రేక, శంకర్, శారద, రాకేష్ కార్మికులు పాల్గొన్నారు.