ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:42 AM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటిస్తూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు.
కలెక్టర్ సత్యప్రసాద్
మల్లాపూర్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటిస్తూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మంగళవారం మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాల యాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పీహెచ్‌సీలోని ల్యాబ్, ఫార్మ సీ గది, మందులు, రికార్డులు, ఓపీ రిజిస్టర్, వార్డులను పరిశీలించి రోగు లతో మాట్లాడి ఆరోగ్య సమస్యలు, అందిస్తున్న సేవలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని భూభారతిలో వచ్చిన దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఆగస్టు 14లోపు నాణ్యమైన సమ స్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధి కారి ప్రమోద్‌కుమార్, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ రమేష్, డీటీ శ్రీని వాస్, వైద్య, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.