Share News

‘రేషన్‌’ ఆశలు

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:20 AM

పేదల్లో రేషన్‌ కార్డుల జారీపై ఆశలు మొదలయ్యాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ఊరటనిస్తూ సర్కార్‌ రేషన్‌ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈనెల 14న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా కార్డుల పంపిణీ ప్రారంభిస్తారు.

‘రేషన్‌’ ఆశలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పేదల్లో రేషన్‌ కార్డుల జారీపై ఆశలు మొదలయ్యాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ఊరటనిస్తూ సర్కార్‌ రేషన్‌ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈనెల 14న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా కార్డుల పంపిణీ ప్రారంభిస్తారు. ఇప్పటికే దరఖాస్తులను పరిశీలించి ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్‌ కార్డులు, కొత్త సభ్యుల చేర్పుల కోసం చేసుకున్న దరఖాస్తుదారుల నిరీక్షణకు తెరపడనుంది. ఆరేళ్లుగా ప్రభుత్వాలు రేషన్‌ కార్డులు విషయంలో లబ్ధిదారులను ఊరిస్తూ వెక్కిరిస్తూనే ఉన్నాయి. దరఖాస్తులు స్వీకరించడం, తర్వాత వాటిని నిలిపివేయడం సాధారణంగా మారింది. రేషన్‌ కార్డుల జారీలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్‌ కూడా చేస్తుందనే విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం దాటవేసే ధోరణిపై అనేక ఆరోపణలు వచ్చాయి. గత సంవత్సరం రేషన్‌ కార్డుల జారీ విధి విధానాలపై సమీక్ష సమావేశం నిర్వహించి డిజిటల్‌ రేషన్‌ కార్డులు అందించాలని నిర్ణయించారు. ఆచరణలోకి రాలేదు. ప్రభుత్వ పథకాలకు ప్రామాణికంగా రేషన్‌ కార్డు ఉండడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలు, రూ 500 సిలిండర్‌ సబ్సిడీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ ఇలాంటి పథకాల్లో లబ్ధి పొందడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తాజాగా రేషన్‌ కార్డుల జారీ చేపడుతుండటంతో ఈసారైనా కార్డులు వస్తాయని ఆశతో దరఖాస్తుదారులు ఉన్నారు.

ఫ కొత్త లబ్ధిదారులు 74,615 మంది

కొత్త రేషన్‌ కార్డులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు మీసేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా కొనసాగిస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేసింది. జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన 16775 దరఖాస్తులను పరిశీలించి 13988 కొత్త కార్డులకు మంజూరు ఇచ్చారు. కొత్త కార్డులో పరిధిలో 42623 మంది లబ్ధిదారుల ఉన్నారు. దీంతోపాటు రేషన్‌ కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం 33616 కార్డుల్లో 45234 మంది తమ పేర్లను కార్డులో చేర్చడానికి దరఖాస్తులు చేసుకున్నారు. చాలా కాలంగా చేర్పులు, మార్పులు కూడా జరగలేదు. ఈసారి కొత్త కార్డులతో పాటు చేర్పులు, మార్పుల దరఖాస్తులను కూడా పరిశీలన పూర్తి చేశారు. కొత్తగా 31992 దరఖాస్తుల ద్వారా 43097 మంది లబ్ధిదారులను కార్డుల్లో చేర్చారు. కొత్త కార్డులు, పాత కార్డుల్లో చేర్చిన లబ్ధిదారులు 74615 మంది ఉన్నారు.

ఫ జిల్లాలో 1.77 లక్షల పాత రేషన్‌ కార్డులు...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం లక్షా 77 వేల 851 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 163900, అంత్యోదయ కార్డులు 137481, అన్నపూర్ణ కార్డులు 203ఉన్నాయి. కార్డుల పరిధిలో 5 లక్షల 35 వేల 920 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ కార్డుల్లో 37389 మంది, ఆహార భధ్రత కార్డుల్లో 498324, అన్నపూర్ణ కార్డుల్లో 207 మంది లబ్ధిదారులు ఉన్నారు.

జిల్లాలో కొత్త రేషన్‌ కార్డులు ...

మండలం కార్డులు లబ్ధిదారులు

బోయినపల్లి 1071 3137

చందుర్తి 819 2469

ఇల్లంతకుంట 851 2593

గంభీరావుపేట 911 2765

కోనరావుపేట 888 2787

ముస్తాబాద్‌ 1498 4675

రుద్రంగి 79 244

సిరిసిల్ల 2632 8090

తంగళ్లపల్లి 1406 4258

వీర్నపల్లి 326 991

వేములవాడ రూరల్‌ 629 1908

వేములవాడ 1403 4338

ఎల్లారెడ్డిపేట 1475 4368

------------------------------------------------------------------------------------------------------

మొత్తం 13988 42623

------------------------------------------------------------------------------------------------------

జిల్లాలో పాత కార్డులో చేర్చిన కొత్త లబ్ధిదారులు ...

మండలం కార్డులు లబ్ధిదారులు

బోయినపల్లి 2117 2819

చందుర్తి 2520 3327

ఇల్లంతకుంట 2733 3693

గంభీరావుపేట 3179 3997

కోనరావుపేట 1883 2610

ముస్తాబాద్‌ 2886 4025

రుద్రంగి 1389 1844

సిరిసిల్ల 4719 6478

తంగళ్లపల్లి 2340 3163

వీర్నపల్లి 1025 1479

వేములవాడ రూరల్‌ 1069 1387

వేములవాడ 2965 4098

ఎల్లారెడ్డిపేట 3167 4177

------------------------------------------------------------------------------------------------------

మొత్తం 31992 43097

------------------------------------------------------------------------------------------------------

Updated Date - Jul 09 , 2025 | 01:20 AM