రైతు భరోసాపై ఆశలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:04 AM
రోహిణి కార్తితో రైతులు వానాకాలం సాగు పనులు మొదలు పెట్టారు. దుక్కులు దున్ని సాగుకు భుములు సిద్ధం చేసుకుని ఎరువులు, విత్తనా లు సమకూర్చుకుంటున్నారు. ఎన్నో ఆశలతో పునాస సాగుకు సిద్ధమైన రైతులకు ఈసారి నైరుతి కూడా ముందే ఆశలను పెంచింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత రోహిణితో వర్షాలు మొదలయ్యాయి.
- పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
రోహిణి కార్తితో రైతులు వానాకాలం సాగు పనులు మొదలు పెట్టారు. దుక్కులు దున్ని సాగుకు భుములు సిద్ధం చేసుకుని ఎరువులు, విత్తనా లు సమకూర్చుకుంటున్నారు. ఎన్నో ఆశలతో పునాస సాగుకు సిద్ధమైన రైతులకు ఈసారి నైరుతి కూడా ముందే ఆశలను పెంచింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత రోహిణితో వర్షాలు మొదలయ్యాయి. కానీ ప్రభుత్వం పెట్టు బడి సాయం మాత్రం ప్రతిసారి ఆలస్యంగానే అందిస్తోంది. యాసంగిలో ప్రభుత్వం ఎకరం, రెండెకరాలు ఇలా విడుతల వారీగా డబ్బులు అం దించింది. ఈ సారి ఒకేసారి రైతులకు ఇవ్వాలని నిర్ణయించడంతో రైతుల కొంత ఉరటగా కలుగుతున్నా డబ్బులు జమ అయిన తర్వాత మంచి రోజు చూసి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మంచి రోజు ఎప్పుడు వస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం ఎకరానికి రూ. 5 వేలు రైతుబంధు పేరుతో అందించారు. ప్రస్తుతం ముగిసిన యాసంగి సీజన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ. 6 వేలు అందించింది. ఎన్ని కల్లో రెండు సీజన్లో కలిపి రూ. 15 వేలు రైతు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎకరానికి రూ. వెయ్యి మాత్రమే పెంచి అందించారు. జిల్లాలో యాసంగిలో 88,055 మంది రైతులకు రూ. 7.03 కోట్లు జమ చేశారు. ఐదు ఎకరాల వరకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అం దించారు. దీంతో మిగతా వారిలో నిరాశ మిగిలింది. ఇప్పటికీ యాసంగిలో పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ సారి వానకాలం సీజన్లో మళ్లీ ఎకరానికి రూ. 6వేలు మాత్రమే జమ చేస్తారని భావిస్తున్నారు. పెట్టుబడి సాయం లేక మళ్లీ రైతులు గత్యంతరం లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు రైతులకు మే మొదటి వారంలోని పెట్టు బడి సాయం అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, రైతులు వ్యాపా రుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదనే అభిప్రాయం ఉన్నది.
2.43 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 43 వేల 783 ఎకరాల్లో వివిధ పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందులో వరి 1 లక్షా 84 వేల 860 ఎకరాలు, పత్తి 49760 ఎకరాలు, పెసర 79 ఎకరాలు, కందులు 1155 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 1600 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. మండలాల వారీగా గంభీరావుపేటలో 19,330 ఎకరాలు, ఇల్లంతకుంటలో 38,470 ఎకరాలు, ముస్తాబాద్‌లో 25,250 ఎకరాలు, సిరిసిల్లలో 5,883 ఎకరాలు, తంగళ్లప ల్లిలో 22,031 ఎకరాలు, వీర్నపల్లిలో 8,792 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 21,130 ఎకరాలు, బోయినపల్లిలో 21,310 ఎకరాలు, చందుర్తిలో 21,610 ఎకరాలు, కోనరావుపేటలో 23,700 ఎకరాలు, రుద్రంగిలో 10,105 ఎకరాలు, వేములవాడ 10,578 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 15,614 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో వరి 1.84 లక్షల ఎకరాలు, పత్తి 49,760 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పెసర 79 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, మొక్కజొన్న 1,600 ఎకరాలు, జొన్నలు 14 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాలు సాగుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లాలో రైతుల కోసం 56,568 క్వింటాళ్ల వరి విత్తనాలు, పెసర 4.08 క్వింటాళ్లు, మొక్కజొన్న 27.04 క్వింటాళ్లు పత్తి 1,28,650 ప్యాకెట్లు కందులు 122.5 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని సిద్ధం చేశారు. వానా కాలం సాగులో ఎరువులు 56,060 మెట్రిక్ టన్నులు అవసరం అవుతా యని అంచనా వేశారు. ఇందులో యూరియా 25,370 మెట్రిక్ టన్నులు, డీఎపీ 3,460 మెట్రిక్‌టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22,390 మెట్రిక్ టన్ను లు, ఎంవోపీ 4,115 మెట్రిక్ టన్నులు ఎస్‌ఎస్‌పీ 725 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు.