Share News

పంటల మార్పిడితో అధిక దిగుబడులు

ABN , Publish Date - May 13 , 2025 | 11:55 PM

వ్యవసా యంలో పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ జె రామారావు అన్నారు.

పంటల మార్పిడితో అధిక దిగుబడులు

కోనరావుపేట, మే 13 (ఆంధ్రజ్యోతి) : వ్యవసా యంలో పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ జె రామారావు అన్నారు. కోనరావుపేట మండల కేంద్రం లోని రైతు వేదికలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వాడకం తగ్గిం చాలని, అవసరం మేరకే వాడాలని అన్నారు. నేలతల్లి ఆరోగ్యాన్ని నాశనం చేసిన వాళ్లం అవుతామని అన్నారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రశీదులు భద్రపరచుకోవాలని అన్నారు. పంటల మార్పిడి వల్ల సుస్థిర ఆదాయాన్ని సాధిస్తామని అన్నారు. చెట్లను పెంచడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్ర మంలో కోనరావుపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కచ్చకయల ఎల్లయ్య, ఫ్యాక్స్‌ చైర్మన్‌ బండ నర్సయ్య, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ లింబయ్య, ప్రభాకర్‌, ఫ్యాక్స్‌ డైరెక్టర్‌ రమేష్‌ రెడ్డి, మామిడి రమ, ప్రభా కర్‌, కొట్టే మహేశ్వరి, రామచంద్రం, హెచ్‌వో లోకేష్‌, ఎంఏఓ పి.సందీప్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజేం దర్‌, డాక్టర్‌ సింధుజ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఏఈవోలు రమేష్‌, సహజ, స్రవంతి, హేమాజీ, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 11:55 PM