Share News

సర్వమత సమ్మేళనానికి అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:12 AM

సర్వమత సమ్మేళనానికి రాష్ట్ర ప్రభు త్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని విప్‌, వేము లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

సర్వమత సమ్మేళనానికి అధిక ప్రాధాన్యం

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : సర్వమత సమ్మేళనానికి రాష్ట్ర ప్రభు త్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని విప్‌, వేము లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. సిరి సిల్ల అర్బన్‌ పరిధిలోని చంద్రంపేటలో గురువా రం రాత్రి జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో విప్‌ ఆది శ్రీనివాస్‌ పాల్గొని కేక్‌ కట్‌చేసి ప్రత్యేక ప్రార్థన లు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో అది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం సర్వమత సమ్మేళనానికి ప్రాధాన్యత ఇస్తోంద న్నారు. పేదల సంక్షేమమే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. ఇటీవలహైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించార న్నారు. పాస్టర్లు సమసమాజ స్థాపనకు కృషి చే యాలని, ప్రార్థన మందిరాలకు వచ్చే వారికి సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, పట్టణ అ ధ్యక్షుడు చోప్పదండి ప్రకాష్‌,బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్య క్షుడు సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 12:12 AM