Share News

ఆమెదే తీర్పు..

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:01 AM

పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.

ఆమెదే తీర్పు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పే గెలుపోటములపై ప్రభావం చూపనుంది. జిల్లాలో మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో తొలి విడత నామినేషన్ల ఘట్టం ముగిసి బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచార బాట పట్టారు. రెండో విడతలో ఉపసంహరణలు కొనసాగుతున్నాయి. మూడో విడతలో నామినేషన్లు శుక్రవారంతో ముగుస్తాయి. బరిలో ఎవరు నిలిచిన మహిళా ఓటర్లు కీలకంగా ఉండడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకంటే అభ్యర్థులు వ్యక్తిగతంగా మహిళలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల ప్రభావంకంటే అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్‌ ప్రభావమే ఎక్కువగా ఉండడంతో మహిళా ఓట్లు ఎవరు కైవసం చేసుకుంటారని చర్చ కూడా గ్రామాల్లో ఉంది. మరోవైపు మహిళా రిజర్వు స్థానాలతో పాటు జనరల్‌ స్థానాల్లో కూడా మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

జిల్లాలో అత్యధికం మహిళా ఓటర్లే..

జిల్లా పంచాయతీ ఎన్నికల్లో 12 మండలాలు, 260 గ్రామపంచాయతీల్లో 3 లక్షల 53 వేల 351 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1701772 మంది, మహిళలు 182559 మంది ఉన్నారు. వీళ్లలో అధికంగా 11787 మంది మహిళలు పురుషులకంటే ఎక్కువగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 260 సర్పంచ్‌, 2268 వార్డులు ఉండగా ఇందులో కొన్ని గ్రామపంచాయతీలో ఏకగ్రీవ ప్రయత్నాలు ఫలించాయి. మొదటి విడతలో 85 సర్పంచుల్లో 9 మంది ఏకగ్రీవం కాగా, 76 సర్పంచ్‌ స్థానాల్లో 229 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డుల్లో 229 ఏకగ్రీవం కాగా, 519 వార్డుల్లో 1377 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత నామినేషన్ల ఉపసంహరణలు కొనసాగుతున్నాయి. ఇందులో 88 సర్పంచ్‌ స్థానాల్లో ఐదు ఏకగ్రీవం కాగా, 758 వార్డులో 180 ఏకగ్రీవం కాగా, మిగిలిన 578 వార్డుల్లో 1677 మంది పోటీలో ఉన్నారు. మూడో విడత నామినేషన్ల పర్వం శుక్రవారం ముగుస్తుంది. ఒకవైపు ఎన్నికల బరిలో ప్రత్యర్థులను బుజ్జగిస్తూ పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తూనే మహిళా ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాల్లో స్వశక్తి సంఘాల లీడర్లతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. జిల్లాలో 411 గామైక్య సంఘాలు ఉండగా, స్వశక్తి సంఘాలు 10450 ఉన్నాయి. ఆయా సంఘాల్లో 108025 మంది సభ్యులు ఉన్నారు. మహిళా సంఘాల నుంచి గంపగుత్తగా ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నాలను అభ్యర్థులు ముమ్మరం చేశారు.

మహిళలకు దక్కని పూర్తి రిజర్వేషన్లు రిజర్వేషన్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు దక్కలేదు. 50 శాతం మహిళలకు రిజర్వు కావలసి ఉండగా, 260 సర్పంచ్‌ స్థానాల్లో 46.76శాతం సీట్లు, 2268 వార్డులో 40.38 శాతం సీట్లు కేటాయించారు. గతంలో కంటే రిజర్వేషన్లు తగ్గిపోవడంతో మహిళల్లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మహిళలు జనరల్‌ స్థానాల్లో సైతం పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్‌ స్థానాల్లో 119 స్థానాలు, 916 వార్డు స్థానాలు మహిళలకు కేటాయించారు. సర్పంచ్‌ స్థానాల్లో 56 బీసీలకు రిజర్వ్‌ చేశారు. ఇందులో మహిళకు 24 స్థానాలు, జనరల్‌గా 32 స్థానాలు ఉన్నాయి. వంద శాతం ఎస్టీ పంచాయతీలు 26 ఉండగా, 11 మహిళలకు, 15జనరల్‌కు కేటాయించారు. మిగతా నాలుగు ఎస్టీ స్థానాల్లో రెండు మహిళలు, రెండు జనరల్‌గా ఉన్నాయి. ఎస్సీలకు 53 స్థానాలు కేటాయించగా 24 మహిళలకు, 29 జనరల్‌గా ఉన్నాయి. జనరల్‌ స్థానాలు 121ఉండగా 58 మహిళకు, 63 జనరల్‌ స్థానాలుగా కేటాయించారు. 2268 వార్డుల్లో వందశాతం ఎస్టీ పంచాయతీల్లో 176 వార్డులు ఉండగా, 88 మహిళకు, 88 జనరల్‌, ఇతర 53 ఎస్టీ వార్డుల్లో 18 మహిళలకు, 35 జనరల్‌గా కేటాయించారు. 442 ఎస్సీ వార్డులలో 177 మహిళకు, 26 జనరల్‌గా ఉన్నాయి. 553 బీసీ వార్డుల్లో 222 మహిళకు, 331 జనరల్‌ స్థానాలుగా ఉన్నాయి. 1044 జనరల్‌ వార్డుల్లో 471 మహిళలకు, 573 జనరల్‌గా ఉన్నాయి. రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో మహిళా రిజర్వ్‌ స్థానాల్లో భార్య, కోడలు, కూతుర్లను బరిలో నిలిపారు. జిల్లాలో కొన్నిచోట్ల కుటుంబ సభ్యులే పోటీపడుతున్న తీరు ఉంది.

జిల్లాలో గ్రామపంచాయతీ ఓటర్లు..

మండలం పురుషులు మహిళలు మొత్తం

బోయినపల్లి 14753 15752 30505

చందుర్తి 13445 14649 28094

ఇల్లంతకుంట 19644 20902 40546

గంభీరావుపేట 17811 18996 36807

కోనరావుపేట 17180 18045 35225

ముస్తాబాద్‌ 18658 19842 38500

రుద్రంగి 6454 7208 13665

తంగళ్లపల్లి 19395 20683 40079

వీర్నపల్లి 5769 5958 11727

వేములవాడ 8953 9523 18492

వేములవాడరూరల్‌ 9020 9805 18825

ఎల్లారెడ్డిపేట 19690 21196 40886

మొత్తం 170772 182559 353351(20 మంది జెండర్‌)

జిల్లాలో స్వశక్తి సంఘాల్లో సభ్యులు..

మండలం సంఘాలు సభ్యులు

బోయినపల్లి 834 9160

చందుర్తి 807 8270

ఇల్లంతకుంట 1152 12142

గంబీరావుపేట 1208 12083

కోనరావుపేట 1088 11421

ముస్తాబాద్‌ 1244 12997

రుద్రంగి 396 4304

తంగళ్లపల్లి 1152 11338

వీర్నపల్లి 363 3960

వేములవాడ 464 4565

వేములవాడరూరల్‌ 532 5657

ఎల్లారెడ్డిపేట 1210 12128

మొత్తం 10450 108025

జిల్లాలో సర్పంచ్‌ మహిళ స్థానాలు

మండలం మొత్తం ఎస్టీలు ఎస్సీలు బీసీలు జనరల్‌

బోయినపల్లి 23 -- 03 02 06

చందుర్తి 19 -- 02 02 04

ఇల్లంతకుంట 35 -- 04 04 09

గంబీరావుపేట 22 01 02 02 05

కోనరావుపేట 28 02 02 03 06

ముస్తాబాద్‌ 22 -- 02 02 05

రుద్రంగి 10 04 -- -- --

తంగళ్లపల్లి 30 -- 03 04 07

వీర్నపల్లి 17 04 01 -- 03

వేములవాడ 11 -- 01 01 03

వేములవాడరూరల్‌ 17 -- 02 02 04

ఎల్లారెడ్డిపేట 26 02 02 02 06

----------------------------------------------------------------------------------------------------

మొత్తం 260 13 24 24 58

----------------------------------------------------------------------------------------------------

జిల్లాలో వార్డుల్లో మహిళ స్థానాలు

మండలం మొత్తం ఎస్టీలు ఎస్సీలు బీసీలు జనరల్‌

బోయినపల్లి 212 -- 23 20 49

చందుర్తి 174 04 15 21 37

ఇల్లంతకుంట 294 -- 24 34 64

గంబీరావుపేట 202 10 15 23 41

కోనరావుపేట 238 14 19 23 46

ముస్తాబాద్‌ 202 04 16 18 45

రుద్రంగి 86 29 01 04 07

తంగళ్లపల్లి 252 -- 18 30 57

వీర్నపల్లి 132 31 06 03 20

వేములవాడ 104 -- 10 11 24

వేములవాడరూరల్‌ 146 -- 13 14 32

ఎల్లారెడ్డిపేట 226 14 16 21 47

----------------------------------------------------------------------------------------------------

మొత్తం 2268 106 117 222 471

----------------------------------------------------------------------------------------------------

Updated Date - Dec 05 , 2025 | 01:01 AM