జిల్లాలో భారీ వర్షం
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:50 AM
జిల్లా వ్యాప్తంగా శనివారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది.
ఫజలమయమైన రహదారులు
ఫనీట మునిగిన ఆకుసాయిపల్లి వంతెన
ఫజగిత్యాల-మంచిర్యాల మార్గంలో రాకపోకలకు అంతరాయం
జగిత్యాల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శనివారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు సగటున 30.9 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లుగా రికార్డు నమోదైంది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా ధర్మపురి మండలం నేరేళ్లలో 61.3 మిల్లీమీటర్లు కురిసింది. ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో 57.3 మిల్లీమీటర్లు, గొల్లపల్లిలో 13.3 మిల్లీమీటరు, అత్యల్పంగా పెగడపల్లిలో 10.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మేడిపల్లిలో 47.3 ఎంఎం, వెల్గటూరులో 44.0 ఎంఎం, సారంగపూర్‌లో 43.5 రాయికల్ మండలం అల్లీపూర్‌లో 41.8 ఎంఎం, కోరుట్లలో 39.3 ఎంఎం, బీర్‌పూర్ మండలం కొల్వాయిలో 37.8 ఎంఎం, బుగ్గారం మండలం సిరికొండలో 34.3 ఎంఎం, రాయికల్‌లో 31.8 ఎంఎం, మెట్‌పల్లిలో 31.0 ఎంఎం, ధర్మపురి మండలం జైనాలో 30.8 ఎంఎం, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 28.5 ఎంఎం, జగిత్యాలలో 26.8 ఎంఎం, ఇబ్రహీంపట్నం మండలం గోదూరులో 25.0 ఎంఎం, మల్యాల మండలం మద్దుట్లలో 24.0 ఎంఎం, కథలాపూర్‌లో 23.3 ఎంఎం, బీమారం మండలం గోవిందారంలో 22.8 ఎంఎం, కొడిమ్యాల మండలం పూడూరులో 21.8 ఎంఎం, మల్లాపూర్‌లో 18.3 ఎంఎం, గొల్లపల్లిలో 13.3 ఎంఎం, పెగడపల్లిలో 10.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
ఫ పలు ప్రాంతాల్లో కూలిన ఇళ్లు
జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం వల్ల జన జీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో రహదారులు, మురికి కాలువలు జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. సారంగపూర్ మండలంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై పారింది. ధర్మపురి మండలంలోని నేరెల్ల పశువుల పాపన్నగుట్ట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో జగిత్యాల-మంచిర్యాల జిల్లాల మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయికల్ మండలంలోని మైతాపూర్ లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వదర నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ధర్మపురి మండలంలోని ఆకుసాయిపల్లె వద్ద లో లెవల్ వంతెన నీట మునగడంతో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ నుంచి ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య వాగు తాత్కాలిక రోడ్డుపై నుంచి ప్రవహించడంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలు, లోలెవల్ వంతెనలు, గోదావరి ఉధృతిని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీ లించారు. ధర్మపురి పట్టణంలోని కాశెట్టివాడలో ఓ పెంకుటిల్లు నేలమట్లమైంది. గొల్లపల్లి మండల కేంద్రంలో రెండు ఇళ్లు కూలిపోయాయి.