Share News

నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన

ABN , Publish Date - May 11 , 2025 | 12:16 AM

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు.

నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన
మంత్రి దామోదర పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన

జగిత్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 8.30 గంటల కు ధర్మపురి రాత్రి బస నుంచి బయలు దేరి జగిత్యాలకు రోడ్డు మార్గాన రానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సందర్శించి పరిశీలన జరుపుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 3.30 గంటలకు కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఇందుకు అనుగుణంగా అవసర మైన ఏర్పాట్లు జిల్లా అధికారులు పూర్తి చేశారు.

మంత్రి పర్యటన విజయవంతం చేయాలి

ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

జిల్లా కేంద్రంలో ఆదివారం జరగనున్న మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటనను విజయవంతం చే యాలని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కోరారు. శనివారం పట్టణంలోని మెడికల్‌ కాలేజీ గెస్ట్‌ హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడారు.

మంత్రి దామోదర్‌ రాజనర్సింహ మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాలకు సంబంధించిన సమస్యలపై ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. మంత్రికి పెద్ద ఎత్తున జిల్లాకు చెందిన దళిత వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలకాలని కోరారు. వీర జవాన్‌ మురళి నాయక్‌ శ్రద్ధాంజలి ఘటించే కార్యక్ర మంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. అనంతరం పట్టణంలోని జరుగుతున్న మంత్రి దామోదర రాజ నర్సింహ పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌ పర్యవేక్షించారు. సమావేశంలో జగిత్యాల, కోరు ట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్‌ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:16 AM