Share News

మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన

ABN , Publish Date - Dec 13 , 2025 | 01:04 AM

జిల్లాలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న శుక్రవారం సభ కార్యక్రమాలతో మహిళలకు తమ ఆరోగ్యం, పిల్లల పోషణపై అవగాహన వస్తోందని కలెక్టర్‌ పమేలాసత్పతి అన్నారు. శుక్రవారం స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని అంగనవాడీ కేంద్ర పరిధిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్‌ హాజరయ్యారు.

మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన
సభలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పతి

- జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ టౌన, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న శుక్రవారం సభ కార్యక్రమాలతో మహిళలకు తమ ఆరోగ్యం, పిల్లల పోషణపై అవగాహన వస్తోందని కలెక్టర్‌ పమేలాసత్పతి అన్నారు. శుక్రవారం స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని అంగనవాడీ కేంద్ర పరిధిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం సభల ద్వారా మహిళలకు ఆరోగ్యం, పిల్లల పోషణతో పాటుగా ప్రభుత్వ కార్యక్ర మాలు, సంక్షేమ పథకాలపై అవగాహన వస్తుందని అన్నారు. ఉచిత వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. దీనితో చాలా మంది మహిళలు రక్తహీనత గురించి తెలుసుకొని అధిగమించారని అన్నారు. తమ పిల్లలు ఎంత బరువు, ఎంత ఎత్తు ఉండాలి అనే విషయం పట్ల తల్లులకు అవగాహన పెరుగుతుందని అన్నారు. దీనితో పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తూ వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని అన్నారు. ఆటపాటలతో కూడిన అంగనవాడీ విద్య పిల్లల భవిష్యతకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. అంగన వాడీల్లో పిల్లల బరువులు, ఎత్తు కొలుస్తూ వారు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చూస్తారని చెప్పారు. పోషకా హారంతో పాటు ఆలనాపాలనా చూసే అంగనవాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలని సూచించారు. ఎవరైనా దివ్యాంగ పిల్లలు ఉంటే వారిని భవిత కేంద్రాల్లో చేర్పించాలని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని, బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ కేంద్రాల నుంచి ఉచితంగా మందులు స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు 4 ఏఎనసి పరీక్షలు చేయించుకోవాలని, ఎంతో ఖరీదైన టిఫా వంటి స్కానింగ్‌ సౌకర్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని తెలిపారు. అనంతరం పిల్లలకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ స్వరూపరాణి, సీడీపీవో సబితాకుమారి, మెడికల్‌ ఆఫీసర్‌ ప్రణవ్‌, చైల్డ్‌లైన కో ఆర్డినేటర్‌ సంపత, సఖి కేంద్రం కౌన్సిలర్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

హరిత రేటింగ్‌కు ఎనిమిది పాఠశాలలు ఎంపిక

- కలెక్టర్‌ పమేలాసత్పతి

కరీంనగర్‌ టౌన : స్వచ్ఛ ఏవం హరిత రేటింగ్‌కు జిల్లా నుంచి ఎనిమిది పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు కలెక్టర్‌ పమేలాసత్పతి తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కలెక్టర్‌, జిల్లా విద్యాధికారి అశ్వినితానాజీ వాకడే అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఎంపికైన కరీంనగర్‌లోని కుమార్‌వాడీ హైస్కూల్‌, పిఎంశ్రీ ఎంపియుపిఎస్‌ ధర్మారం, జడ్పీహెచఎస్‌ పచ్చునూరు, అన్నారం, జడ్పీహెచ ఎస్‌ ఒద్యారం, ఎంపియుపిఎస్‌ కాసారం, ఎంపియుపిఎస్‌ ఇస్లాంనగర్‌, ఎంపియుపిఎస్‌ కొండాపూర్‌ ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ ఏవం హరిత రేటింగ్‌లో జాతీయ స్థాయికి ఎంపికయ్యేందుకు ప్రధానోపాధ్యా యులు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అందుకు అవసరమైన సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని అన్నారు. పాఠశాలల్లో విటమిన గార్డెన్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కో ఆర్డినేటర్‌ ఆంజనేయులు, ఎంఈవో ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 01:04 AM