ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:42 AM
స్వాతంత్య్ర వేడుకలు శుక్ర వారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకున్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వేడుకలు శుక్ర వారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకున్నారు. జడ్పీ సీఈవో వినోద్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, సెస్ చైర్మన్ చిక్కాల రామా రావు, సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వ రూపతిరుపతిరెడ్డి, డైరెక్టర్లు కాసర్ల రాజు, దుబాల వెంకటేశం, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి మ్యాన ప్రసాద్, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, టీపీసీసీ కో ఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, జిల్లా ప్రధానకార్యదర్శి వెంగళ అశోక్, ఉపాధ్యక్షులు ఎండీ ఖాజామొయి నొద్దిన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్య క్షుడు ఆకునూరి బాలరాజు, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కాము ని వనిత, ప్రధాన కార్యదర్శి అరుణ తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, మాజీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, మాజీ వైస్‌చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల అర్బన్ పరిధిలోని గ్రామాల్లో స్వాతం త్య్ర వేడుకలను నిర్వహించారు. పెద్దూరు సింగిల్‌విండో చైర్మన్ జీల కిష న్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు పోచవేని సత్య ఎల్లయ్య, పాతూరి రాజిరెడ్డి, బుర్ర లక్ష్మి, నాగరాజ్ గౌడ్, లింగంపెల్లి సత్యనారయణ, చెన్నమనేని కీర్తి కమలాకర్‌రావు, ఎర్రవెల్లి వెంకటరమణారావు నాయకులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయం ఎదుట అధ్యక్షులు రెడ్డబోయిన గోపి జాతీయ జెండాను అవిష్కరించారు. అమృతలాల్ శుక్లా కార్మిక భవనం ఎదుట ఐద్వా కార్యదర్శి విమల జాతీయ జెండాను అవిష్కరించారు. సిసిఏం కార్యలయం అవరణలో కార్యదర్శి మూషం రమేశ్, సిఐటియు కార్యలయంలో కోడం రమణలు జెండాలను అవిష్కరించారు.