సతీమణులకే జై..
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:15 AM
రాజకీయాల్లో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు కార్యకర్తల్లో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. రాజకీయాల్లో ఏర్పడే స్నేహలు అవసరార్థం కుదిరేవిగా నిరూపిస్తాయి. తమ అవసరాలకు అడ్డుపడనంత వరకు మాత్రమే తమ స్నేహితులు, శిష్యులకు అవకాశం కలిపించడానికి గురువులు సహకరిస్తారు.
- రిజర్వేషన్ల మార్పుతో మహిళలకు ఛాన్స్
- జిల్లాలో 260 సర్పంచ్ స్థానాల్లో 119 మహిళలకే..
- 2268 వార్డు స్థానాల్లో 916..
- జనరల్ స్థానాల్లోనూ పోటీకి ఆసక్తి..
- రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ పోరు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రాజకీయాల్లో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు కార్యకర్తల్లో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. రాజకీయాల్లో ఏర్పడే స్నేహలు అవసరార్థం కుదిరేవిగా నిరూపిస్తాయి. తమ అవసరాలకు అడ్డుపడనంత వరకు మాత్రమే తమ స్నేహితులు, శిష్యులకు అవకాశం కలిపించడానికి గురువులు సహకరిస్తారు. అలా కాకపోతే శిష్యులు కూడా రాజకీయ వ్యవహారాలు చూడడం, జెండాలు మోసే కార్యకర్తగానే మారిపోతారు. గురువులు కూడా వారి కింది స్థాయిల్లోనే ఉంచడానికి కృషి చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతోపాటు మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ శనివారం ముగుస్తుంది. జిల్లాలోని 260 సర్పంచ్‌లు, 2268 వార్డు సభ్యులకు సంబంధించిన వాటి రిజర్వేషన్ల ఖరారు కొందరి స్థానాలు మారిపోయాయి. జనరల్‌గా అవుతాయి అనుకున్న మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఎన్నో యేళ్లుగా రాజకీయాల్లో, పదవుల్లో ఉన్న వారు రిజర్వేషన్లు మారడంతో తమ శిష్యులకు, ఇతరులకు అవకాశం కల్పించడానికి ఇష్టపడడం లేదు. గతంలో పలుమార్లు సర్పంచ్‌లుగా పని చేసిన వారు, వారి భార్యలను రంగంలోకి నిలపడానికి సిద్ధమయ్యారు. మరోవైపు వృద్ధాప్యంతో పదవుల్లో కొనసాగలేకపోయిన వాళ్లు కూడా తమ వారసత్వంగా కొడుకులను రంగంలోకి తీసుకురావడంతో ఎన్నో యేళ్లుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు నిరాశే ఏర్పడింది. కేవలం అధికార పార్టీలే కాకుండా విపక్ష పార్టీల్లో ఇదే పరిస్థితి ఉండడంతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఆశావహుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
మహిళలకు 1035 సర్పంచ్, వార్డు స్థానాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు ఉండగా, 260 సర్పంచ్, 2268 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ స్థానాల్లో 119 స్థానాలు, 916 వార్డు స్థానాలు మహిళలకు కేటాయించారు. సర్పంచ్ స్థానాల్లో 56 బీసీలకు రిజర్వ్ చేశారు. ఇందులో మహిళకు 24 స్థానాలు, జనరల్‌గా 32 స్థానాలు ఉన్నాయి. వంద శాతం ఎస్టీ పంచాయతీలు 26 ఉండగా 11 మహిళలకు, 15 జనరల్‌కు కేటాయించారు. మిగతా నాలుగు ఎస్టీ స్థానాల్లో రెండు మహిళలు, రెండు జనరల్‌గా ఉన్నాయి. ఎస్సీలకు 53 స్థానాలు కేటాయించగా 24 మహిళలకు, 29 జనరల్‌గా ఉన్నాయి. జనరల్ స్థానాలు 121ఉండగా 58 మహిళకు, 63 జనరల్ స్థానాలుగా కేటాయించారు. 2268 వార్డుల్లో వందశాతం ఎస్టీ పంచాయతీల్లో 176 వార్డులు ఉండగా 88మహిళకు, 88 జనరల్, ఇతర 53 ఎస్టీ వార్డుల్లో 18 మహిళలకు, 35 జనరల్‌గా కేటాయించారు. 442 ఎస్సీ వార్డులలో177 మహిళకు, 26 జనరల్‌గా ఉన్నాయి. 553 బీసీ వార్డుల్లో 222మహిళకు, 331 జనరల్ స్థానాలుగా ఉన్నాయి. 1044 జనరల్ వార్డుల్లో471 మహిళలకు, 573 జనరల్‌గా ఉన్నాయి.
జిల్లాలో 3.53 లక్షల మంది ఓటర్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలో మహిళల ఓటర్లు అఽధికంగా ఉన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల్లో కూడా జనరల్, రిజర్వ్ చేసిన స్థానాల్లో కూడా మహిళలే ఎక్కువగా పోటీ చేయడం వల్ల వారిదే అధిక్యత ఉండే అవకాశం కనిపిస్తుంది. జిల్లాలోని గ్రామపంచాయతీల్లో 3 లక్షల 53 వేల 351 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1701772 మంది, మహిళలు 182559 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 11787 మంది అఽధికంగా ఉన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళలకు పోటీకి పార్టీలు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. కానీ గతంలో పని చేసిన సర్పంచ్‌లు, గ్రామపెద్దలు పార్టీల్లో పని చేస్తున్న నాయకురాళ్లకు కాకుండా తమ వారసులకు, సతీమణులకే అవకాశాలు కల్పించడంతో పార్టీల్లో నిరాశలు కనిపిస్తున్నాయి.
జిల్లాలో సర్పంచ్ మహిళ స్థానాలు
మండలం మొత్తంసర్పంచ్ ఎస్టీలు ఎస్సీలు బీసీలు జనరల్
బోయినపల్లి 23 -- 03 02 06
చందుర్తి 19 -- 02 02 04
ఇల్లంతకుంట 35 -- 04 04 09
గంబీరావుపేట 22 01 02 02 05
కోనరావుపేట 28 02 02 03 06
ముస్తాబాద్ 22 -- 02 02 05
రుద్రంగి 10 04 -- -- --
తంగళ్లపల్లి 30 -- 03 04 07
వీర్నపల్లి 17 04 01 -- 03
వేములవాడ 11 -- 01 01 03
వేములవాడరూరల్ 17 -- 02 02 04
ఎల్లారెడ్డిపేట 26 02 02 02 06
----------------------------------------------------------------------------------------------------
మొత్తం 260 13 24 24 58
----------------------------------------------------------------------------------------------------
జిల్లాలో వార్డుల్లో మహిళా స్థానాలు
మండలం మొత్తం వార్డులు ఎస్టీలు ఎస్సీలు బీసీలు జనరల్
బోయిన్‌పల్లి 212 -- 23 20 49
చందుర్తి 174 04 15 21 37
ఇల్లంతకుంట 294 -- 24 34 64
గంబీరావుపేట 202 10 15 23 41
కోనరావుపేట 238 14 19 23 46
ముస్తాబాద్ 202 04 16 18 45
రుద్రంగి 86 29 01 04 07
తంగళ్లపల్లి 252 -- 18 30 57
వీర్నపల్లి 132 31 06 03 20
వేములవాడ 104 -- 10 11 24
వేములవాడరూరల్ 146 -- 13 14 32
ఎల్లారెడ్డిపేట 226 14 16 21 47
-----------------------------------------------------------------------------------------
మొత్తం 260 106 117 222 471
-----------------------------------------------------------------------------------------