Share News

జయహో జగన్నాథ...

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:13 AM

జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర శనివారంర వైభవంగా నిర్వహించారు. రాంనగర్‌ రమాసత్యనారాయణస్వామి ఆలయం వద్ద కలెక్టర్‌ పమేలా సత్పతి పూజలు నిర్వహించి, రథం ఎదుట ఊడ్చి యాత్రను ప్రారంభించి రథాన్ని లాగారు. అనంతరం సీపీ గౌస్‌ ఆలం పూజలు నిర్వహించారు.

జయహో జగన్నాథ...

కరీంనగర్‌ కల్చరల్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర శనివారంర వైభవంగా నిర్వహించారు. రాంనగర్‌ రమాసత్యనారాయణస్వామి ఆలయం వద్ద కలెక్టర్‌ పమేలా సత్పతి పూజలు నిర్వహించి, రథం ఎదుట ఊడ్చి యాత్రను ప్రారంభించి రథాన్ని లాగారు. అనంతరం సీపీ గౌస్‌ ఆలం పూజలు నిర్వహించారు. రాంనగర్‌, తెలంగాణాచౌక్‌, బస్టాండ్‌, కమాన్‌, శాస్త్రిరోడ్‌, టవర్‌సర్కిల్‌ మీదుగా యాత్ర వైశ్యభవన్‌కు చేరుకుంది. దారి పొడవునా వివిధ పాఠశాలల విద్యార్థులతో పాటు భక్తులు ఇంటిల్లిపాది హాజరై పూలు చల్లుతూ, రథాన్ని లాగుతూ దేవతామూర్తులను సందర్శించి తన్మయత్వం చెందారు. వైశ్యభవన్‌లో నరహరి ప్రభుదాస్‌ ప్రసంగం, సంకీర్తన, మహాహారతి నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా ట్రాఫిక్‌ పోలీసులు ఆయా చోట్ల దారి మళ్ళింపు చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో ఇస్కాన్‌ కరీంనగర్‌ అధ్యక్షుడు నరహరి ప్రభుదాస్‌, చైర్మన్‌ కన్న కృష్ణ, కో చైర్మన్లు డాక్టర్‌ ఎడవెల్లి విజయేంద్రరెడ్డి, డాక్టర్‌ ఎల్‌ రాజభాస్కర్‌రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, పోరెడ్డి శ్రీహరిరెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ సంఘటిత శక్తిగా మారాలి..

- కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్‌

హిందువులందరూ సంఘటిత శక్తిగా మారాలని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం నగరంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో టవర్‌సర్కిల్‌ వద్ద పాల్గొని పూజలు జరిపి రథాన్ని లాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో జగన్నాథ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించామని, నిర్వాహకులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హిందూ సంఘటిత శక్తికి ఈ యాత్రే నిదర్శనమని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ వై సునీల్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌, నిజామాబాద్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:13 AM