చిన్ననీటి వనరుల సర్వేకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:14 AM
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో చిన్న నీటి వనరుల సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నీటి వనరుల లభ్యత, తద్వారా ఎంత మొత్తం విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయో సర్వే చేపడుతారు. ఆ మేరకు జిల్లాలో గల 207 రెవెన్యూ గ్రామాల పరిఽధిలో సర్వే నిర్వహించేందుకు ఒక్కో ఎన్యూమరేటర్‌ను నియ మించారు. 47 మంది వ్యవసాయ విస్తీర్ణాధికారులు, 107 మంది గ్రామ పంచాయతీ అధికారులు, 49 మంది పంచాయతీ కార్యదర్శులు, ముగ్గురు ఉపాధిహామీ పథ కం ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగిం చింది.
- నీటి వనరుల లభ్యత, పంటల సాగుపై ఐదేళ్లకోసారి సర్వే
- 207 రెవెన్యూ గ్రామాల పరిధిలో సర్వే
- సర్వే కోసం వ్యవసాయ, పంచాయతీ, రెవెన్యూ శాఖల సిబ్బంది నియామకం
- ఈ నెల మూడో వారంలో మొదలు కానున్న సర్వే
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో చిన్న నీటి వనరుల సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నీటి వనరుల లభ్యత, తద్వారా ఎంత మొత్తం విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయో సర్వే చేపడుతారు. ఆ మేరకు జిల్లాలో గల 207 రెవెన్యూ గ్రామాల పరిఽధిలో సర్వే నిర్వహించేందుకు ఒక్కో ఎన్యూమరేటర్‌ను నియ మించారు. 47 మంది వ్యవసాయ విస్తీర్ణాధికారులు, 107 మంది గ్రామ పంచాయతీ అధికారులు, 49 మంది పంచాయతీ కార్యదర్శులు, ముగ్గురు ఉపాధిహామీ పథ కం ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగిం చింది. సర్వే చేపట్టేందుకు శిక్షణ తరగతులు నిర్వహిం చనున్నారు. అనంతరం ఈ నెల మూడో వారం నుంచి అన్ని గ్రామాలు, పట్టణాల్లో సర్వే నిర్వహించనున్నారు. మూడు మాసాల క్రితమే కేంద్ర ప్రభుత్వం సర్వే చేయాలని ముఖ్య ప్రణాళికశాఖాధికారులను ఆదే శించింది. ఈ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వ పరిఽధిలో పం చాయతీరాజ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల్లో క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంలో జాప్యం చేసింది. అప్పటి వరకు మండలాల్లో పనిచేస్తున్న మండల పరిషత్ గణాంకశాఖ అధికారులు రెండు గ్రామాల్లో సర్వే చేయాలని పీవో సూచించడంతో సర్వే మొదలు పెట్టారు. గ్రామాలు, పట్టణాల్లో ఉండే నీటి వనరుల లభ్యత, తద్వారా సాగ వుతున్న పంటల వివరాలను సేకరించాలని ఆదేశిం చారు. ప్రతీ ఐదేళ్లకోసారి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో గల చిన్ననీటి వనరులైన చెరువులు, కుం టలు, బావులు, బోరు బావులు, ఎత్తిపోతల పథకాల్లో ఉన్న నీటి లభ్యత, సాగవుతున్న పంటల వివరాల గురించి సర్వే చేస్తారు. ఇప్పటి వరకు ఆరుసార్లు సర్వే నిర్వహించగా, ప్రస్తుతం చేపట్టనున్న సర్వే 7వసారి కావడం గమనార్హం. ఈసారి గ్రామాల్లోనే గాకుండా పట్టణాలు, వాటి పరిసరాల్లో ఉండే నీటి వనరులపై కూడా సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశిం చింది. ఈ సర్వే ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దేశ అవసరాలకు పంటల అవసరాలకు సరిపడా నీటి లభ్యత ఉందా లేదా అని పరిశీలించనున్నారు. ఈ సర్వేను అనుసరించి నీటి వనరులను పెంపొం దించేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసి పలు పథకాలను అమల్లోకి తీసుకరానున్నారు.
ఫ ఈసారి యాప్ ద్వారా సర్వే
గ్రామాలు, పట్టణాల్లో గల చిన్న నీటివనరుల ద్వారా నీటి లభ్యత ఎంత ఉంది, వాటి కింద ఎన్ని ఎకరాల భూములకు సాగు నీరు అందుతున్నాయి. సాగు నీటి అవసరాలకే గాకుండా, తాగునీటి అవసరాలకు కూడా సద్వినియోగం అవుతున్నాయా, ఇతరత్రా అవసరాలకు సద్వినియోగం అవుతున్నాయా? తదితర అంశాలపై సర్వే చేయనున్నారు. గతంలో మ్యానువల్‌గా కాగితా లపై సర్వే చేయగా. ఈసారి యాప్ ద్వారానే సర్వే చేయనున్నారు. చిన్న నీటి వనరుల వద్దకు వెళ్లి సెల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న యాప్ ఓపెన్ చేసి వివరాలను నమోదు చేయాలి. చెరువులు, కుంటల వద్దకు వెళ్లి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగింగ్ ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మొదట 100 ఎకరాలలోపు ఆయకట్టు గల నీటి వన రులపై సర్వేచేసి, ఆ తర్వాత 100 ఎకరాలకు పైగా ఉన్న వాటి గురించి సర్వే చేయనున్నారు. 250 ఎకరాల ఆయకట్టుకు పైబడిన వాటి గురించి వేర్వేరుగా సర్వే నిర్వహించనున్నారు. ఇవేగాకుండా బిందు, తుంపర సేద్యంలో నీటిలభ్యత, నిల్వ సామర్థ్యం, విద్యుత్ వాడ కం, పంటల వివరాలను సేకరించాల్సి ఉంటుంది. వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1090 చెరువులు, కుంటలు ఉన్నాయి. 24,172 వ్యవ సాయ బోర్‌వెల్స్, 43,049 వ్యవసాయ బావులు ఉన్నాయి. వీటి ద్వారా 1,51,854 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. గ్రామాల్లో చిన్నచిన్న కుంటలు కబ్జాకు గురై కనుమరుగయ్యాయి. కాగితాల్లో ఉన్న లెక్కల ప్రకారం క్షేత్రస్థాయిలో నీటి వనరులు కనబడ డం లేదు. ఈ సర్వే ద్వారా జిల్లాలో సజీవంగా ఎన్ని చెరువులు, కుంటలు ఉన్నాయో తెలియనున్నది. ఈసారి సర్వే వివరాలను యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుం డడంతో పక్కాగా జరగనున్నది. సర్వే ద్వారా వెల్లడయ్యే వివరాల ప్రకారం చిన్ననీటి వనరులను కాపాడుకు నేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనున్నది. ఈ సర్వే ఒక్క కేంద్ర ప్రభుత్వానికే గాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉపయోగపడనున్నది. 2017-18లో నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో 36,378 వ్యవ సాయ బావులు, 1184 గొట్టం బావులు, 2,931 మధ్య తరహా గొట్టం బావులు, 2385 ఇతర గొట్టం బావులు ఉన్నాయి. ఉపరితల నీటి వనరుల పథకాలు 1402, ఎత్తిపోతల పథకాలు 261 ఉన్నాయని సీపీవో గంప రవీందర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.