రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
ABN , Publish Date - May 31 , 2025 | 12:30 AM
జిల్లాలో నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ బీఎస్ లత తెలిపారు.
అదనపు కలెక్టర్ బీఎస్ లత
జగిత్యాల, మే 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ బీఎస్ లత తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ వేడుకలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతాయని ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు హాజరుకావాలని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పూర్తిచేయాలని అన్నారు. వేదిక వద్ద వైద్య బృందంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయా లని, అవసరం మేరకు తాగు నీటి ఏర్పాట్లు చేయాలని వైద్య, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని స్వశక్తి సంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ భీంరావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు.