Share News

కలెక్టరేట్‌ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:42 AM

బతుకమ్మ, దసరా పండుగల వేళ ప్రభుత్వం పెం డింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు.

కలెక్టరేట్‌ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : బతుకమ్మ, దసరా పండుగల వేళ ప్రభుత్వం పెం డింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. జీపీ మహిళ సిబ్బంది, కార్మికులు కలెక్టరేట్‌ గేటు ముందు బతుకమ్మ ఆడుతూ వినూత్న నిరసన లు చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌లోని అధికా రులకు వినతిపత్రం అందించారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి,యూనియన్‌ మం డలాల అధ్యక్షులు వర్కొలు మల్లయ్య, బుర్ర శ్రీని వాస్‌, అక్కల అంజయగౌడ్‌, లొకిని శ్రీనివాస్‌, న్యా త నర్సయ్య, జెల్లిలక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 12:42 AM