Share News

వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం..

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:19 AM

మండలంలో ఆదివారం వేకువజామున కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది.

వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం..

ఎల్లారెడ్డిపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివారం వేకువజామున కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. మండల కేంద్రంతోపాటు రాచర్లబొప్పాపూర్‌, రాచర్లగొల్లపల్లి, రాచర్లతిమ్మాపూర్‌, రాచర్లగుండారం, అల్మాస్‌పూర్‌, రాజన్నపేట తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడి సి ముద్దయింది. నిద్రలో ఉన్న రైతులు కేంద్రాల వద్దకు పరుగులు తీశారు. అంతలోపే ఆరబెట్టిన ధాన్యం వరదపాలయింది. రెక్కల కష్టం కొట్టుకుపోవడంతో కాపాడుకునేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. తేమశాతం వచ్చిన ధాన్యం తడిసి పొవడం వల్ల తిరిగి ఆరబెట్టేందుకు అష్టకష్టాలు పడ్డారు. కొట్టుకుపోయిన ధాన్యం చూసి అన్నదాతలు ఆం దోళన చెందారు. తూకం వేయడంలో జాప్యం వల్ల ధాన్యం తడిసిపోతోందని, ధాన్యం రంగు మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో సుమారు 300 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోవడంతో పాటు మరో 800 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందని రైతులు పేర్కొంటున్నా రు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగవం తం చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Nov 03 , 2025 | 12:19 AM