ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి
ABN , Publish Date - May 31 , 2025 | 12:27 AM
కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం బీర్‌పూర్ మండ లం లో పర్యటించిన కలెక్టర్ ఆకస్మికం గా కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.
- వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి
- కలెక్టర్ సత్యప్రసాద్
బీర్‌పూర్, మే 30 (ఆంధ్రజ్యో తి): కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం బీర్‌పూర్ మండ లం లో పర్యటించిన కలెక్టర్ ఆకస్మికం గా కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. మండలంలోని చర్లపల్లి, కందెనకుంట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిం చి ధాన్యం పెండింగ్ ఉండకుండా కొనుగోల్లు వేగవంతం చేయాలని అఽధికారులను ఆదే శించారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వెంట వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలని ఆదేశించా రు. ట్యాబ్ డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు ఉంటా యని హెచ్చ రించారు. అదే సమయంలో రైతులతో మాట్లాడుతూ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం కొనుగోలు చేసి లారీలు లోడ్ అయిన వెంటనే మిల్లులకు తరలిస్తామన్నారు. రైతు లు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అఽధికారి మధుసూదన్, తహసీల్దార్ సుజాత, డిప్యూ టీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.