ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:57 AM
రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ దాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ దాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం కనగర్తి, వట్టిమల్ల గ్రామాల్లో కోనరావుపేట సిం గిల్‌విండో, ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవా రం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 240వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు. రైతులు తేమ 17 శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు. కనగర్తిలో రైతుల సంఖ్య ఎక్కువని, వారికి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చే స్తున్నదని విప్ తెలిపారు. కార్యక్రమంలో డీసీవో రామకృష్ణ, కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, పాక్స్ చైర్మన్ బండ నర్స య్య, వైస్‌చైర్మన్ అనుపాటి భూంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ తాళ్ల పల్లి ప్రభాకర్, డైరెక్టర్లు రాజేందర్, వెంగళ వెంకన్న, మల్లారెడ్డి, నాయిని ప్రభాకర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు కర్రోల్ల భాస్కర్, గొట్టే రుక్మిణి, రావులపల్లి మైపాల్‌రెడ్డి, సాగర్, గంగయ్య, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.