Share News

తేమ శాతం నిబంధన లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:41 AM

తేమ శాతం నిబంధన లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్‌ చేశారు.

తేమ శాతం నిబంధన లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

ఎల్లారెడ్డిపేట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తేమ శాతం నిబంధన లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్‌ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యం పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తూకంవేయడంలో నిర్లక్ష్యం వల్ల రైతులు పండించిన ధాన్యం తడిసిపోయిందనిన్నారు. అన్నదాతలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తేమ పేరిట కొనుగోలు చేయడానికి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. మిల్లర్లతో ఇన్‌చార్జి కలెక్టర్‌ చర్చించి కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని అన్నారు. లేని పక్షంలో రైతులకు అండగా తమ పార్టీ నిలబడి ఆందో ళనలు చేపడుతామని గోపి హెచ్చరించారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, నరేశ్‌, గణేశ్‌, బాలకృష్ణ, కిరణ్‌నాయక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:41 AM