Share News

షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:25 AM

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభు త్వం వారం రోజుల్లో కొనుగోలు చేయాలని, లేకుంటే ఆందోళనలు చేపడుతామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.

షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

సిరిసిల్ల రూరల్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభు త్వం వారం రోజుల్లో కొనుగోలు చేయాలని, లేకుంటే ఆందోళనలు చేపడుతామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వాతావరణం అనుకూలించక పోవడంతో రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ నిలిచిపోవడంతో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం మొలుకలు రావడంతో రైతులు గోస పడుతున్నారన్నారు. అయినా రాష్ట్ర ప్రభు త్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు అకాల వర్షాలు పడుతుంటే మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు, అధికారులు తేమ శాతం పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు నిరీక్షిస్తున్నారని అన్నారు. రైతులు కష్టాలు, బాధలను అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మాత్రం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో మునిగిపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్లు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం తేమశాతం నిబంధనలు లేకుండా జిల్లాలోని మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వ ర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతామన్నారు. ఈ సమావే శంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోన్నాల తిరుపతి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దుమా ల శ్రీకాంత్‌, మండలాల అధ్యక్షులు బూర శేఖర్‌, మిర్యాల్‌కర్‌ బాలాజీ, సోల్ల క్రాంతికుమార్‌, రేపాక రామచంద్రం, పరమేష్‌, మొకిలి విజేందర్‌, కొడే రమేష్‌, లక్పతి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 12:25 AM