Share News

తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:54 AM

కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నిర్వాహకులకు సూచించారు.

తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
వడుకాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

జూలపల్లి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నిర్వాహకులకు సూచించారు. మండలంలోని వడుకాపూర్‌, కాచాపూర్‌, వెంకట్రావు పల్లి, కీచులాటపల్లి, కుమ్మరికుంట గ్రామాల్లో సింగిల్‌ విండోల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో విండో చైర్మన్‌ పుల్లూరి వేణుగోపా ల్‌రావు, కార్యదర్శులు రవిందర్‌రెడ్డి, గీస సురేష్‌, కాంగ్రెస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

‘ధరణి’ పేరుతో కోట్లు కొల్లగొట్టిన బీఆర్‌ఎస్‌ నాయకులు

కాల్వశ్రీరాంపూర్‌ (ఆంధ్రజ్యోతి): ధరణిపేరుతో బీఆర్‌ఎస్‌ నాయకులు కోట్ల రూపాయలు కొల్లగొట్టార ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆరోపిం చారు. శుక్రవారం మండల కేంద్రంలో కలెక్టర్‌తో కలిసి ఇందిరమ్మ మోడల్‌హౌస్‌ ప్రారంభించి అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. భూ భారతి కార్యక్రమం లో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ రాష్ట్రమంతా తీసుకువచ్చి ప్రభుత్వ భూములు అన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జా చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చారన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌, సింగిల్‌ విండో చైర్మన్లు రామిడి తిరుపతిరెడ్డి, చదువు రాంచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:55 AM