ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:31 AM
మండలంలోని వివిధ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు.
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
బుగ్గారం నవంబర్ 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని వివిధ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ మేరకు మండలంలోని సిరికొండ, వెలుగొండ, బుగ్గారం, సిరివంచ కోట గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో సిబ్బంది రైతుల నుంచి ఎటువంటి కట్టింగ్ లేకుండా కొనాలని ఎటువంటి సమస్యలు ఎదురైన తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ ఫంక్షన హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, సివిల్ సప్లయర్ జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో సుమంత, మార్కెట్ కమిటీ చైర్మన చిలుముల లావణ్య, మండల వ్యవసాయ అధికారి అక్షిత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల సుభాష్, మండల ఉపాధ్యక్షుడు నగునూరి నర్సాగౌడ్, పీఏసీఏస్ సీఈవో రాజేష్ తదితరులు పాల్గొన్నారు.