ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:46 AM
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు.
వేములవాడ టౌన్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అద నపు కలెక్టర్ గురువారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369గా నిర్ణయించిందని తెలిపారు. రైతులు తమ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్ర యించి, మద్దతు ధర పొందాలన్నారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలన్నారు.
ఫ బోయినపల్లి : బోయినపల్లి మండలం మానువాడ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్విం టాలుకు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369గా నిర్ణ యించిందని తెలిపారు. రైతులు తమ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు. తేమ శాతం వచ్చిన ధాన్యా న్ని కొనుగోలు చేసి, కేటాయించిన రైస్ మిల్లులకు తరలిం చాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ నారాయ ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.