దళారుల పాలవుతున్న ధాన్యం..
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:15 AM
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం దళారులపాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం దళారులపాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని ముస్కానిపేట గ్రామంలో ఆదివారం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప రైస్‌మిల్లులను అలాట్ చేయకపోవడం వల్ల అన్ని గ్రామాల్లో ధాన్యం సేకరణ జరుగడం లేదన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తుందన్నారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని, రైతుబరోసా రూ 12 వేలు ఇస్తామని మోసం చేసిందన్నారు. ప్రభుత్వం వెంటనే దాన్యం సేకరణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తొలుత బీఆర్‌ఎస్ ఇల్లంతకుంట గ్రామశాఖ అధ్యక్షుడు కూనబోయిన రఘు వివాహ వేడుకలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీమాజీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహ్మరెడ్డి, సెస్‌డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, మాజీ ఏఎమ్‌సీ చైర్మన్ చింతపల్లి వేణురావు, నాయకులు జితేందర్‌గౌడ్, కేవీఎన్‌రెడ్డి, పర్శరాం, సాదుల్, సావనపెల్లి అనీల్‌కుమార్, ర్యాగటి రమేష్, శ్రీనివాస్, తిరుపతి, నాగరాజు, దొంతుల శంకర్, కొట్టె వెంకటి, అంతగిరి భాస్కర్, కళ్యాణం నర్సయ్య, మామిడి తిరుపతి, మహేష్, జనార్దన్, దమ్మని మధు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.