జీపీవో, లైసెన్స్‌డ్ సర్వేయర్ ఎంపిక పరీక్షలు ప్రశాంతం
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:03 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో ఆదివారం నిర్వహించిన జీపీవో, లైసెన్స్‌డ్ సర్వేయర్ అభ్యర్థుల ఎంపిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
సిరిసిల్ల టౌన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో ఆదివారం నిర్వహించిన జీపీవో, లైసెన్స్‌డ్ సర్వేయర్ అభ్యర్థుల ఎంపిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని గీతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీపీఓ, లైసెన్డ్స్ సర్వేయర్ అభ్యర్థుల ఎంపిక పరీక్షలు జరగాయి. పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అకస్మిక తనిఖి నిర్వహించారు. పరీక్ష నిర్వాహణ తీరును కలెక్టర్ నిశితంగా పరిశీలించి అభ్యర్థుల హాజరుపై ఆరా తీశారు. పరీక్షలు పకడ్బదింగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకుజరిగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 39 మంది అభ్యర్థులకు గాను 35 మంది హాజరుకాగ నలుగురు గైర్హాజరు అయ్యారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన లైసెన్డ్స్ సర్వేయర్ థియరీ పరీక్షకు 156 మంది అభ్యర్థులకు 141 మంది హాజరుకాగా 15 మంది గైర్హాజరైన్నారు. మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు లైసెన్డ్స్ సర్వేయర్ అభ్యర్థులకు సెకెండ్ సేషన్ ప్లాటింగ్ పరీక్షకు 156 మంది అభ్యర్థులకు గాను 139 మంది హాజరుకాగా 17 మంది గైర్హాజరైన్నారు. పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, సీపీఓ శ్రీనివాసచారి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్‌కుమార్ పాల్గొన్నారు.