జీపీ సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:56 PM
గ్రామ పంచాయతీ సిబ్బంది మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జగదీష్ సూచించారు.
కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ సిబ్బంది మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జగదీష్ సూచించారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలం 14 గ్రామ పంచాయతీల మల్టీపర్పస్ వర్కర్లకు చామనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీపీఓ హజరయ్యారు. అనంతరం వర్కర్లకు దుస్తులు, పిపి కిట్లు పంపిణీ చేసి సన్మానం చేశారు. పారిశుధ కార్మికులు పీపీ కిట్లు ధరించి పని చేయాలన్నారు. స్వచ్చతాహీ సేవా కార్యక్రమంలో బాగంగా ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం చామనపల్లి గ్రామ పంచాయతీ వద్ద కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీవో జగన్మోహన్‌రెడ్డి, యునిసెఫ్ జిల్లా కో ఆర్డినేటర్ కిషన్ స్వామి, ఎస్‌బీఎం జిల్లా కో ఆర్డినేటర్ రమేష్, వేణు, హెల్త్ ఆఫీసర్ మనోహర్ పాల్గొన్నారు.