విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:42 AM
విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ సత్యకుమార్ అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ గ్రామంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా విద్యా బోధనను కలెక్టర్ ప్రారంభించారు.

- కలెక్టర్ సత్యప్రసాద్
- జిల్లాలోని పలు పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బోధన తరగతులు ప్రారంభం
జగిత్యాలరూరల్, మార్చి 15 ( ఆంధ్రజ్యోతి): విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ సత్యకుమార్ అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ గ్రామంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా విద్యా బోధనను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కలెక్టర్ మాట్లాడుతూ విధ్యార్థులకు సులభతర విద్యాబోధన అందిం చేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపా రు. విద్యార్థులు కంప్యూటర్‌లో చేస్తున్న తెలుగు, ఇంగ్లీషుకు సంబంధించిన ప్రమాణాలను పరీశీ లించారు. కార్యక్రమంలో డీఈవో రాము, ఆర్డీవో మధు సూదన్, ఆకాడమిక్ మానిటరింగ్ అధికారి, ప్రధా నోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ జగిత్యాల మండలం ధరూర్ జడ్పీహెస్‌ఎస్ పాఠశాలలో ఏఐ ద్వారా విద్యాబోధనను జగిత్యాల మండల విద్యాధికారి భీమయ్య ప్రారంభించారు.
మెట్‌పల్లి రూరల్: మండలంలోని మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏఐ తరగతులను మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. వేంపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్‌రెడ్డి, మెట్‌పల్లి ఏఎంసీ డైరెక్టర్లు గోరుమంతుల ప్రవీణ్, పల్లి శేఖర్‌గౌడ్‌లు పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు పీసు రాజేం దర్‌రెడ్డి, మల్లిఖార్జున్, బద్దం రాజారెడ్డి, తరి విక్రమ్, జిన్నా శ్రీకాంత్, లక్ష్మి, రమ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: మండలంలోని కొత్తధాంరాజుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏఐ బోధనను మండల విద్యాధికారి దామోదర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కథలాపూర్: మండలంలోని సిరికొండ ప్రాథమిక పాఠశాలలో ఎంఈవో లోకిని శ్రీనివాస్ ప్రారంభిం చారు. బొమ్మెన, తక్కళ్ళపల్లి ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఏఐ బోధన ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్టు ఎంఈవో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విష్ణు, వనతడుపుల రవికుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.
గొల్లపల్లి: మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల లో ఏఐ తరగతులను జిల్లా విద్యాధికారి రాము ప్రారంభించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జమున, సెక్టొరియల్ ఆధికారి కొక్కుల రాజేష్, చిప్ప సత్యనారాయణ, ఎం చంద్రకళ, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కోరుట్ల రూరల్/ ఇబ్రహీంపట్నం: కోరుట్ల మండల మోహన్‌రావుపేట ఇబ్రహీపట్నం మండలం ఎర్థండి, తిమ్మాపూర్ ఎంపీపీస్ పాఠశాలలో విద్యార్థులకు ఏఐ బోధన శిక్షణ తరగతులను ఇబ్రహీపట్నం మండల విద్యాధికారి బండారి మధు, మోహన్‌రావుపేట కాంప్లెక్ ప్రధానోపాధ్యా యుడు అనంద్ రావుల ప్రారంభించారు. మోహన్‌రావుపేటలో పాఠశాల ప్రదానోపా ధ్యాయుడు కిషన్, ప్రాథమిక ప్రధానోపా ధ్యాయురాలు రమాదేవి, ఉపాధ్యాయలు శివ, ఇబ్రహీపట్నంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, భూపతి, ఉపాధ్యాయలు విజయ్ లక్ష్మి, నికిత్, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ దేవేందర్, మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాయికల్: మండలంలోని ఆలూరు ప్రాథమిక పాఠశాలలో శనివారం ఎఫ్‌ఎల్‌ఎన్‌లో సి గ్రేడ్ వచ్చిన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా విద్యా బోధనను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ నాయకుడు మెక్కొండ రాంరెడ్డి, విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ చిలుక సంజీవ్, పాఠశాల ప్రధానోపాధ్యా యుడు అక్కినపల్లి సతీష్, ఉపాధ్యాయులు సాయి కృష్ణ, రమేష్ రెడ్డి, శృతి పాల్గొన్నారు.
బుగ్గారం: మండలంలోని మద్దునూర్ పాఠశాలలో ఏఐ బోధన తరగతులను మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుకర్ రావు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేష్, సీఆర్పీ పురుషోత్తం, మాజీ సర్పంచ్ తిరుపతి, మధు సూదన్, ఉపాధ్యాయులు రవీంద్రనాథ్, సతీష్ కుమా ర్, కొమరయ్య, సుజాత, శంకరయ్య, లలిత, సాయన్న తదితరులు పాల్గొన్నారు.