అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం
ABN , Publish Date - Dec 12 , 2025 | 01:32 AM
అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, కాంగ్రెస్‌పార్టీ బలపర్చిన అభ్యర్థులను గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలిపించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, కాంగ్రెస్‌పార్టీ బలపర్చిన అభ్యర్థులను గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలిపించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని పొత్తూరు, కందికట్కూర్, ఒబులాపూర్, వెల్జీపూర్, వెంకట్రావుపల్లె, గొల్లపల్లె, సోమారంపేట, రేపాక గ్రామాలలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు గత ప్రభుత్వ హయాంలో గ్రామాలకు నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు, అధికారపార్టీ వారిని గెలిపిస్తే నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తీర్చడానికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, నాయకులు బొల్లవేని రమేష్, ఎలగందుల ప్రసాద్, అలువాల కోటి, గుండ వెంకటేశం, సత్యం, సర్పంచ్ అభ్యర్థులు పద్మ, తిరుపతి, ముక్కీస వసంత, నవీన్‌కుమార్, శిరీష, నవీన్‌రెడ్డి, భారతమ్మ, కాథ మల్లేశంలతోపాటు నాయకులు పాల్గొన్నారు.