పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - May 24 , 2025 | 12:52 AM
కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు.

వీర్నపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందన్నారు. పేదింటి బిడ్డలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి వారి కళ్ళల్లో ఆనందం చూస్తామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి మండలంలో ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరికీ పారదర్శకంగా ఇళ్ల మంజూరు జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో బ్రోకర్లను నమ్మి మోసపోవద్దు అన్నారు. ఇల్లు నిర్మించే లబ్ధిదారులు నేరుగా అధికారులను సంప్రదించి విడతలవారీగా డబ్బులు తీసుకొని నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, హౌసింగ్ పీడీ రవిశంకర్, మండల ప్రత్యేక అధికారి అజ్మీర రాందాస్, ఎమ్మార్వో ముక్తార్ పాషా, ఎంపీడీవో అబ్దుల్ వాజీద్, హౌసింగ్ ఏఈ చైతన్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బిటి యాదవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.