Share News

పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:55 PM

పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

వేములవాడ రూరల్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి) : పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని వట్టెంల గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్ర్తాలను అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారన్నారు. పేదలకు అనేక సంక్షేయ పథకాల ను అమలుపరుస్తున్నామన్నారు. ఇళ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మం జూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో రెండో విడతలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరూ చేశామన్నారు. అనంతరం వట్టెంల గ్రామంలో మ హిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇందిరా గాంధీ జయంతి సంద ర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు అందజేస్తున్నామ న్నారు. రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి చీరలు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే లక్షా 45వేల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నా మన్నారు. మహిళా సంఘంలో లేని వారికి కూడా ఇందిరమ్మ చీరలు అందిస్తామ న్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, కాంగ్రెస్‌ పార్టీ మండ ల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, మార్కె ట్‌ కమిటీ సభ్యులు పాలకూర్తి పర్శరాములు, దైత కుమార్‌, మండల యూత్‌ కాం గ్రెస్‌ అధ్యక్షుడు రోమాల ప్రవీణ్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్‌, మహిళలు, పలు వురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 11:55 PM