మత్స్య కార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:14 AM
మత్స్య కార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్య శాఖ జిల్లా అధికారి సౌజన్య అన్నా రు.
ఎల్లారెడ్డిపేట, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మత్స్య కార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్య శాఖ జిల్లా అధికారి సౌజన్య అన్నా రు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ గ్రామ శివారులోని జక్కుల చెరువులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, మత్స్య కార్మిక సహ కార సంఘాల ప్రతినిధులతో కలిసి ఆదివారం ఆమె ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అధికారి సౌజన్య మాట్లాడు తూ మత్స్య కార్మికుల సంక్షేమానికి సర్కారు పాటుపడుతోందన్నారు. మత్స్య కార్మికులు చేప పిల్లల పెంపకంతో ఉపాధి పొందాలన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని 28, వీర్నపల్లి మండలంలోని 7 చెరువుల్లో 8,62,785 చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో మత్స్యకారుల జిల్లా సంక్షే మ సంఘం అధ్యక్షుడు దేవదాస్, డైరెక్టర్ శివరామకృష్ణ, మత్స్యశాఖ అధికారులు కిరణ్, సతీష్, వెంకటేశ్, ఏఎంసీ వైస్‌చైర్మన్ రాంరెడ్డి, ఏజీపీ కృష్ణ, నాయకులు గౌస్, బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజ్‌కుమార్, పోచయ్య, శ్రీనివాస్, సుధాకర్, రమేశ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.