కార్మిక, ప్రజా వ్యతిరేక విఽధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:07 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఆదివారం నగరంలోని ముకుందలాల్‌మిశ్రా భవన్‌లో జిల్లా 11 మహాసభలు నిర్వహించారు.
భగత్‌నగర్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఆదివారం నగరంలోని ముకుందలాల్‌మిశ్రా భవన్‌లో జిల్లా 11 మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఏకతాటిపై వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు. జిల్లాలో సీఐటీయూ కార్మికుల ఉద్యోగుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో కొత్త రంగాలకు మండలాలకు సీఐటీయూ విస్తరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం 26 వేలు, పెండింగ్ జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి, కార్యదర్శి ఎడ్ల రమేష్, ఉపాధ్యక్షుడు యు శ్రీనివాస్, జనగాం రాయమల్లు, గుడికందుల సత్యం, కొప్పుల శంకర్, మారెళ్ల శ్రీలత, పున్నం రవి, రాజేశం, నాలువాల స్వామి పాల్గొన్నారు.