Share News

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్‌

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:09 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డిని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్‌

వేములవాడ, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డిని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలతో పాటు పలు అభివృద్ధి పనులపై ఆది శ్రీనివాస్‌ ముఖ్యమంత్రితో చర్చించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి పనుల ప్రారంభం, ఇటీవలి శృంగేరి పర్యటన వివరాలను తెలియజేశారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రోటోకాల్‌ పాటించకుండా కలెక్టర్‌ వ్యవహరించిన తీరు, కలెక్టర్‌ పనితీరును వివరించినట్లు సమాచారం.

Updated Date - Sep 24 , 2025 | 12:09 AM