Share News

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:59 AM

కాంగ్రెస్‌ ప్రభు త్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిం చాలని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ పిలుపునిచ్చారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి

వేములవాడ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభు త్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిం చాలని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ పిలుపునిచ్చారు. కోనరావుపేట మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు కోనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ మాజీ ఛైర్మన్‌, మాజీ ఎంపీపీ అబ్బాసాని శంకర్‌ గౌడ్‌, మర్రిమడ్ల తాజా మాజీ సర్పంచ్‌ మాట్ల అశోక్‌, కొలనూరు ప్యాక్స్‌ డైరెక్టర్‌ ఇప్ప రాములు, మాజీ వార్డు సభ్యు లు శంకరవ్వ, బొడ్డు కిషన్‌లతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్‌ ఎస్‌ కార్యకర్తలు శనివారం వేములవాడలో ఆది శ్రీనివాస్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవంతో వచ్చే ఎన్నికలలో కాం గ్రెస్‌ విజయం కోసం కృషి చేయాలని కోరారు. పదేళ్లపాటు అధికా రంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ నాణ్యతలేని నిర్మాణాలతో రాష్ట్ర అభి వృద్ధిని ధ్వంసం చేసిందని, పేదలకు సంక్షేమ పథకాలు కూడా అందించలేకపోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులందరికీ నూతన రేషన్‌ కార్డులు, సన్న బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టామన్నా రు. ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌, పది లక్షల రూపా యల మేరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సహాయం అందిస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు బండ నర్సయ్య యాదవ్‌, జగన్‌మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:59 AM