నూతన సర్పంచులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:10 AM
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచలకు ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాగార్డెనలో ఆత్మీయ సమావేశం జరిగింది. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
కరీంనగర్ అర్బన, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచలకు ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాగార్డెనలో ఆత్మీయ సమావేశం జరిగింది. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా సర్పంచలకు బాధ్యతలు ఉంటాయని, ప్రభుత్వ పథకాలు అందించటంలో, ఇతర కష్టాల సమయంలో వారికి అండగా ఉండాలన్నారు. ఎన్నికలు జరగకుండా నిలిచిపోయినా.. నిధులు వస్తాయని, ముఖ్యమంత్రి గ్రామాలకు నిధులు ఇస్తామని చెప్పారని, ఎమ్మెల్యేలు కూడా నిధులు ఇస్తారని మంత్రి చెప్పారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ, పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ స్ఫూర్తితో సీఎం రేవంతరెడ్డి గ్రామ సర్పంచులను బలోపేతం చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. మాజీ మంత్రి టి జీవనరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా స్థానాల్లో కాంగ్రెస్ సర్పంచల గెలుపు ప్రభుత్వ పనితనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో 65 శాతం మేరకు ప్రజల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి లభించిందన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను గ్రామాల్లో అమలు చేసే బాధ్యత సర్పంచులదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గ్రాంథాలయ చైర్మన సత్తు మల్లేశం, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇనచార్జి ఒడితల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరెపల్లి మోహన, కార్పొరేషన కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన కుమార్, నాయ కులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్, సంగీతం శ్రీనివాస్, సర్పంచల సంఘం మాజీ అధ్యక్షులు అంజనిప్రసాద్ ఇతర నాయకులు పాల్గొన్నారు.