Share News

ప్రభుత్వాల విధానాలతో బీడీ కార్మికులకు ఉపాధి కరువు

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:43 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో బీడీ కార్మికులకు సరైన ఉపాధి లేకుండా పోయిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వి రమ అన్నారు.

ప్రభుత్వాల విధానాలతో బీడీ కార్మికులకు ఉపాధి కరువు

సిరిసిల్ల రూరల్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో బీడీ కార్మికులకు సరైన ఉపాధి లేకుండా పోయిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వి రమ అన్నారు. సిరిసిల్ల పట్ట ణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌ శుక్లా కార్మిక భవ నంలో శుక్రవారం సీఐటీయూ బీడి సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం జరిగింది. ఈ సందర్బం గా ఈనెల 27, 28 వతేదీలలో జరిగే జిల్లా స్ధాయి 3వ మహాసభకు సంబంధించిన కరపత్రాలను నా యకులతో కలిసి ఎస్‌వి రమ అవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో రమ మాట్లాడు తూ జిల్లాలో సుమారు లక్ష మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారన్నారు. ప్రభుత్వాలు అసుసరిస్తున్న విధానాల వలన బీడీ కార్మికులకు సరైన ఉపాధి దొరకడం లేదన్నారు. ఈనెల 27, 28వ తేదీలల్లో జిల్లా కేంద్రం లో రెండురోజుల పాటు బీడీ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా మహాసభలు జరుగుతాయన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి కోడం రమణ, సూరం పద్మ, గుర్రం అశోక్‌, అన్నల్‌దాస్‌ గణేష్‌, శ్రీరా ముల రమేష్‌చంద్ర, దాసరి రూప, గోవిందు లక్ష్మణ్‌, జిందం కమలాకర్‌, బెజుగం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:43 AM