ధాన్యం కొనుగోళ్లను విస్మరించిన ప్రభుత్వం
ABN , Publish Date - May 03 , 2025 | 11:39 PM
ప్రభుత్వం ఏర్పాటుచే సిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని పోసి రెండు నెలలు గడుస్తున్న ఇంతవరకు జిల్లా అధికారులతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని, వారంలోగా పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయి న గోపి అన్నారు.
సిరిసిల్ల రూరల్, మే 3 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఏర్పాటుచే సిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని పోసి రెండు నెలలు గడుస్తున్న ఇంతవరకు జిల్లా అధికారులతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని, వారంలోగా పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయి న గోపి అన్నారు. సిరిసిల్ల పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న దేశంలో 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయని కులగణ ను దేశవ్యాప్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేయడానికి తీసుకున్న నిర్ణయం సంచలనమన్నారు. 1931లోనే బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేస్తే మళ్లీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం తెలంగాణాలో కులగణను చేపట్టేందుకు ఆ పార్టీ నాయకులు ఒపుకోలేదన్నారు. ఆర్టికల్ 370, వక్ఫ్ బిల్లులు, త్రిబుల్ తలాక్ బిల్లులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దేశవ్యాప్తంగా కులగణన తమతోనే వచ్చిందని ప్రకటించుకోవడం శోచనీయమన్నారు. దేశంలో విప్లవాత్మక ధైర్యమైన నిర్ణయం తీసుకోవాలన్న బీజేపీ సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేని స్థితికి ప్రభుత్వం చేరిపోయిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యంను కొనుగోలు చేయకపోవడంతో రెండు నెలలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని అరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యంకు సైతం డబ్బులు ఇవ్వడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వ విప్‌తోపాటు జిల్లా కలెక్టర్‌లు స్పందించిన ధాన్యంను వేగంగా కొనుగోలు చేసి డబ్బులను రైతులకు చెల్లించాలచాలన్నారు. లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో అందోళన లు చేపడుతామన్నారు. ఈ సమావేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, ఎల్లారెడ్డి పేట మండల అధ్యక్షుడు పోన్నాల తిరుపతిరెడ్డి, దుమాల శ్రీకాంత్, వంతడుపుల సుధాకర్, సిరిసిల్ల వంశీ, ఊరగోండ రాజు, చొప్పదండి శ్రీనివాస్,గుడ్ల విష్ణు, అంకారపు రాజు, వేముల సురేష్, ఇంజ్జపూరి మురళి తదితరులు పాల్గొన్నారు.