రైతులపై నిర్లక్ష్యం చూపుతున్న ప్రభుత్వం
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:51 PM
రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ అన్నారు.
వేములవాడ టౌన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ అన్నారు. శనివారం వేములవాడ అర్బన్ మండలంలోని అనుపురం గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదన్నారు. ఉప ఎన్నికలపై ఉన్న దృష్టి అకాల వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న రైతులపై లేదన్నారు. ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు చేయాలని, ఎలాం టి ఆంక్షలు లేకుండా డబ్బులు చెల్లించాలన్నారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ అర్బన్ మండల శాఖ అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్, నాయకులు లింగంపల్లి శంకర్, జింక అనిల్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనే భాస్కర్, ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి ప్రశాంత్, గుండె కార్ల లక్ష్మణ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సంతోష్‌యాదవ్, యువ మోర్చా అధ్యక్షుడు అరవింద్, ఉపాధ్యక్షులు రమేశ్, తిప్పవేణి రాజు, కార్యదర్శి సంజీవరెడ్డి, అధికార ప్రతినిధి శ్రీధర్, నాయకులు చల్ల నర్సయ్య, సీహెచ్ నర్సయ్య, ఎర్రం రమేశ్, లక్ష్మీనర్సు, మల్లేశం, రాము, వికాస్, తిరుపతి, దామోదర్‌రెడ్డి, రవి, తిరుపతి యాదవ్, మధు, రైతులు పాల్గొన్నారు.