Share News

ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:54 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ఇల్లంతకుంట, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోని వారు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఇల్లంతకుంట మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం 125 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తుండటంతో ప్రజల్లో ఆదరణ లభిస్తుందన్నారు. దీనిని చూసి తట్టుకోలేని కొంతమంది నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అండగా నిలువాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కనీసం సీఎం సహాయనిధి అందడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన 18నెలల్లో 18విడతలుగా సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశామన్నారు. మానకొండూర్‌ క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి దరఖాస్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్యాక్స్‌ మాజీ చైర్మన్‌ ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షరాలు తీగల పుష్పలత, చిట్టి ఆనందరెడ్డి, ప్రసాద్‌, ఎర్రోజు సంతోష్‌కుమార్‌, మామిడి రాజు, కూనబోయిన బాలరాజు, ఉస్మాన్‌, రేగుల కార్తీక్‌, మంద పెద్దబాల్‌రెడ్డి, కాథ మల్లేశం, యాస తిరుపతి, కాసుపాక సురేష్‌, బెజ్జంకి శ్రీనివాస్‌, గూడ బాబు, దయాసాగర్‌, రవిలతో పాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 12:54 AM