విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:16 AM
విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబ ర్స్‌మెంట్ బకాయిలను విడు దల చేయకుండా విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఏబీవీపి జిల్లా కన్వీనర్ రాజురావు అ న్నారు.
వేములవాడ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబ ర్స్‌మెంట్ బకాయిలను విడు దల చేయకుండా విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఏబీవీపి జిల్లా కన్వీనర్ రాజురావు అ న్నారు. వేములవాడ పట్టణం లో కోరుట్ల బస్టాండు సమీపం నుంచి తెలంగాణ చౌక్ వరకు సీఎం రేవంత్‌రెడ్డి శవయాత్ర నిర్వహించి నిప్పుంటించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అడ్డుకున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపైన బైఠాయిం చారు. ఈ సందర్భంగా రాజురావు మా ట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలు విడుదల చేయకపోవడంతో విద్యా ర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉన్నత చదువుల కోసం ప్రైవేటు కళాశాల యాజమన్యాలు సర్టిపికెట్స్ ఇవ్వడం లేద ని, దీంతో పెద్ద మొత్తం పేద విద్యార్థుల వద్ద డబ్బులు దండుకుంటున్నారని ఆరో పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైన కళ్లు తెరిచి బకాయిలు చెల్లించి విద్యార్థుల పక్షా ణ నిలబడాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు ఉన్న రూ.8 వేల 500 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి పరిషత్ ఉధృతంగా పోరాటం చేస్తుందని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో శివాజీ, పూజం కార్తీక్, వికాస్, హరీష్, ధనుష్, గణేష్, సుమన్ తదితరులు ఉన్నారు.