Share News

విద్యార్థులను విస్మరిస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:14 AM

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను విస్మరిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్‌ అన్నారు. పెండింగ్‌లోని ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని కోరుతూ శనివారం నగరంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు.

విద్యార్థులను విస్మరిస్తున్న ప్రభుత్వం
నగరంలో భిక్షాటన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

భగత్‌నగర్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను విస్మరిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్‌ అన్నారు. పెండింగ్‌లోని ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని కోరుతూ శనివారం నగరంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహి ల్స్‌ ఎన్నికల్లో విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తామని హామీ ఇస్తున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ విద్యార్థులు పేద మధ్య తరగతి కుటుంబాలపై లేదన్నారు. విద్యార్థులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంపెల్లి అరవింద్‌, ఆసంపల్లి వినయ్‌సాగర్‌, దుర్గం భోగేష్‌, గట్టు అకాష్‌, రాకేష్‌; సందేశ్‌, నాయకులు సన్నీత్‌, సంతోష్‌, రామ్‌చరణ్‌, దుర్గా, సాయిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:14 AM