గ్రామీణులకు అందుబాటులో సర్కార్ వైద్యం
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:50 PM
గ్రామీణ ప్రజలకు సర్కార్ వైద్యం అందుబాటులో ఉంచాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామంలో పల్లె దవాఖానను శుక్రవారం ప్రారంభించారు.
తిమ్మాపూర్(మానకొండూర్), సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రజలకు సర్కార్ వైద్యం అందుబాటులో ఉంచాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామంలో పల్లె దవాఖానను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యంతో పాటు సౌకర్యాలు కల్పించిందన్నారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గ్రామీణ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పోలంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బండారి రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్‌ఎల్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, రమాణారెడ్డి, రంగారావు, రాజేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాధాకిషన్‌రావు, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.