Share News

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:43 AM

ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసిం హారావు అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

వేములవాడ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసిం హారావు అన్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని బీఆర్‌ఎస్‌ నాయకు లతో మంగళవారం ఆయన వేములవాడలోని తన నివాసంలో సమావేశం అయ్యా రు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయడంలేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలో నూ జాప్యం చేయడంతో ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తడం వల్ల వందలాది మంది రైతులు నష్టపోయారన్నారు. కేసీఆర్‌ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశా రు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఏనుగు మనోహర్‌ రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్‌, సీనియర్‌ నాయకులు పోలాస నరేందర్‌, నరాల దేవేందర్‌, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్‌, మారం కుమార్‌, జోగిని శంకర్‌, సిరిగిరి చందు, నరా ల శేఖర్‌, గోలి మహేష్‌, నాయకులు నీలం శేఖర్‌, వెంగళ శ్రీకాంత్‌ గౌడ్‌, అంజద్‌ పాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:43 AM