గోదావరి మహా హారతిని విజయవంతం చేయాలి
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:30 AM
: ధర్మపురి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం జరిగే గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి దామె ర రాంసుధాకర్‌రావు కోరారు.
ధర్మపురి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం జరిగే గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి దామె ర రాంసుధాకర్‌రావు కోరారు. స్థానిక గోదావరి నది మంగళిగడ్డ స్నానఘట్టం వద్ద శనివారం మహా హరతి కోసం స్థలాన్ని పరిశీలిం చారు. ఈ సందర్భంగా రాంసుధాకర్‌రావు మాట్లాడుతూ ధర్మపురి క్షేత్రంలో 14 ఏళ్లుగా గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం స్థలాన్ని ఎంపిక చేసి, వేదిక, టెంట్లు వేసే ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అలాగే వీఐపీ గ్యాలరీ, భక్తులు కూర్చొనేలా కుర్చీలు వేసే ఏర్పాట్లు పరిశీలించారు. గోదావరి మహా హారతి కార్యక్రమా నికి భాగ్యనగర్ బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధి పతులు అవఽధూతగిరి మహారాజ్, పీఠాధిపతులు మహామం డలేశ్వర్ డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్, గోదావరి హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన, బీజేపీ జాతీయ నాయకుడు పోల్సాని మురళీధర్ రావు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. వైదిక స్మార్త జ్యోతిష్య పౌరాణికులు, పాలెపు భరతశర్మ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగంపెల్లి వీరగోపాల్, రాష్ట్ర కార్యదర్శి బల్గూరి సంతోష్ రావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి క్యాతం వెంకటరమణ తదితరులు హాజరవుతారని ఆయన వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గోదావరి హార తి ఉత్సవ సమితి జిల్లా సభ్యులు పిల్లి శ్రీనివాస్, కందాల నర్సింహమూర్తి, బండారి లక్ష్మణ్, బెజ్జారపు లవణ్, గాజు భాస్కర్, కుమ్మరి తిరుపతి, వీహెచపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకు లు కస్తూరి రాజన్న, సంగి నర్సయ్య, దొనకొండ నరేష్, నలుమాసు వైకుంఠం, గాజు భాస్కర్, తిరుమనదాసు సత్య నారాయణ, అప్పం మల్లేష్,, పల్లెర్ల సురేందర్, కాశెట్టి హరీ ష్‌తదితరులు పాల్గొన్నారు.