బాలికలు విద్యావంతులుగా ఎదగాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:25 AM
బాలికలు సురక్షితంగా విద్యావంతులుగా ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షు రాలు బీ పుష్పలత అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : బాలికలు సురక్షితంగా విద్యావంతులుగా ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షు రాలు బీ పుష్పలత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగ ణంలో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో ఘనం గా అంతర్జాతీయ బాలికల దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షు రాలు బీ పుష్పలత మాట్లాడారు. బాలికలు సురక్షితంగా విద్యావంతు లుగా స్వయం సమర్థులుగా ఎదగడానికి సమాజంలోని ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. సమాజంలో ప్రతి బాలిక గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉందన్నారు. చట్టాలపై ప్రతి మహిళ అవగాహన పెంచు కోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్య దర్శి రాధిక జైస్వాల్ మాట్లాడుతూ వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలకు సంబంధించిన బహుమతులు జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ, తెలంగాణ రాష్ట్ర లీగల సర్వీసెస్ అథారిటీ ఏఈజీఐఎస్ కింద స్పాన్సర్ చేయబడిందన్నారు. అనంతరం జిల్లా న్యాయసేధికార సంస్థ ఆధ్వర్యం లో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటిలలో విజేతలైన విద్యా ర్థులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాల బీ పుష్పలత బహుమతులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఎస్ వినీతరెడ్డి పాఠశాల ప్రధానో పాధ్యాయుడు మోతిలాల్, నాయవాదులు వేణు, అంజనేయులు లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.